బీజేపీ గెలిస్తే సీఎంగా బండి సంజయ్
తెలంగాణా రాష్ట్రంలో చివరి రోజు ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని పార్టీలు ప్రచారంలో తుది ఘట్టంలో భాగంగా ఓటర్ మనసును గెలుచుకునే పనిని గట్టిగా చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? అన్న చర్చ కూడా జోరుగానే సాగుతుంది.
ఈ క్రమంలో తాజాగా కరీంనగర్ లో బండి సంజయ్ ను గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఆద్యుడు మంద క్రిష్ణ మాదిగ అన్నారు. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన నేడు ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రం కిసాన్ నగర్ లోని మైత్రి కన్వెన్షన్ నుండి బీజేపీ శ్రేణులు మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఊహించని రీతిలో యువకులు, మహిళలు సైతం స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొని బండి సంజయ్ కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీ ప్రారంభంలో బండి సంజయ్, రిటైర్డ్ డీజీ క్రిష్ణప్రసాద్ లతో కలిసి మంద క్రిష్ణ మాదిగ ప్రసంగించారు. బండి సంజయ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు .
ఈసారి చారిత్రాత్మక సందర్భాలున్నాయని, బీసీని సీఎం చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించినందున బలహీనవర్గాల సీఎం గా బండి సంజయ్ కాబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో 50 శాతానికిపైగా ఎస్సీ, 18 శాతం ఎస్సీలున్నారు. బీసీ తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ సీఎం కాలేదు..ఆ అపూర్వ అవకాశం ఇప్పుడు వచ్చిందని ప్రధానమంత్రి తెలిపారన్నారు.
జనాభాలో 1, 2 శాతం జనాభా కూడా లేనివాళ్లే 75 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ 50 శాతానికిపైగా ఉన్న బీసీల్లో ఒక్కరిని కూడా సీఎం చేయలేదు. దీనినిబట్టి కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ సహా అధికారం చెలాయించిన పార్టీలన్నీ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లేనని మంద కృష్ణ మాదిగ అన్నారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. బీసీ అయిన బండి సంజయ్ సీఎం అవుతారని చెప్పటం ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications