బెంగుళూరు రేవ్ పార్టీ.. నేడు పోలీసుల ముందుకు నటి హేమతో పాటు వారు, ఉత్కంఠ!!
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 86 మందిని విచారించనున్న పోలీసులు నేడు 8మందిని విచారణకు పిలిచారు . బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వారిని నేడు విచారణకు పిలిచారు.
నేడు హేమతో పాటు 86మందిని విచారించనున్న బెంగళూరు పోలీసులు
ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమ తో పాటు 86 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు నేడు వీరిలో 8మందిని విచారించనున్నారు. సి సి బి ముందు నేడు హాజరుకావాలని, వీరికి పోలీసులు నోటీసులు జారీ చేసిన క్రమంలో వీరందరినీ విడివిడిగా బెంగళూరు పోలీసులు విచారించనున్నారు. మరి ఈ విచారణలో మరెన్ని కీలక విషయాలు బయటకు వస్తాయి అన్నది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిగా మారింది.

బెంగళూరు రేవ్ పార్టీ లో ప్రధాన సూత్రధారులు కటకటాల్లో
ఇదిలా ఉంటే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌస్ లో గత ఆదివారం భారీ రేవ్ పార్టీ నిర్వహించారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిని అరెస్ట్ చేశారు. వారందరి నుండి రక్త నమూనాలను సేకరించి, ప్రధాన సూత్రధారులుగా భావించిన లంకపల్లి వాసు తో పాటు మరో నలుగురిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
డ్రగ్స్ తీసుకున్న 59 మంది పురుషులు, 27 మంది మహిళలు
ఇప్పటికే ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు. మిగతా వారందరిని స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు. వీరంతా ఎప్పుడు విచారణకు పిలిచినా పోలీసుల ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. మొత్తం 103మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 86మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడయింది. ఇందులో 59మంది పురుషులు, 27మంది మహిళలు ఉన్నారు.
రేవ్ పార్టీ కేసులో నేడు పోలీసుల ముందుకు హేమ
బెంగళూరు పార్టీకి అసలు తాను వెళ్ళనే లేదని చెప్పిన నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. అయితే నేడు హేమ కూడా విచారణకు హాజరు కావలసిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు అవుతారా? ఒకవేళ హాజరైతే విచారణలో ఆమె ఏమి చెబుతారు? తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కు సంబంధించి హేమ ఏమైనా కీలక విషయాలు వెల్లడిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications