పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ .. పోస్ట్ పెట్టిన సెలబ్రిటీ
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని మరోమారు విమర్శలకు దిగారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరును వర్మ తప్పుపట్టారు. ఈ ఎన్నికల్లో సెంట్రర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారిన బర్రెలక్క అలియాస్ శిరీషతో పోలుస్తూ .. తన జనసేన అధినేతపై మాటల తూటాలను వదిలారు.
Never seen a more disinterested and more careless campaign more than @PawanKalyan ‘s in telangana😳 Neither him nor the organisers seem to bother even about the Mike sound from which he is speaking … Compared to him Barrelakka’s is far better https://t.co/YupPwSfnRt
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2023
పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌తో పోలిస్తే బర్రెలక్క చాలా బెటర్ అని రామ్ గోపాల్ వ్యాఖ్యనించారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో బర్రెలక్కను చూసి నేర్చుకోవాలని పవన్ కల్యాణ్‌కు వర్మ సూచించారు. పవన్ తాను మాట్లాడుతున్న మైక్ పని చేస్తుందో లేదో చూసుకోకుండానే మాట్లాడటం దీనికి నిదర్శనమని రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు.

ఆయన ఇక్కడితో ఆగకుండా... పవన్ ప్రచారానికి రావడం అభ్యర్ధలకు ఏమాత్రం ఇష్టం లేదేమో అనిపిస్తుంది..ఆయన మాట్లాడుతున్న మైక్ సౌండ్ రావడం లేదని తెలిసినప్పటికీ కూడా అక్కడున్న వారు ఈ విషయాన్ని పవన్‌కు తెలియజేయలేదంటూ వర్మ కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్‌పై వర్మ చేసిన కామెంట్స్‌పై జనసైన, బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసే రామ్ గోపాల్ వర్మ పవన్ గురించి విమర్శలు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications