Barrelakka: ప్రచారంలో దూసుకెళ్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క..
తెలంగాణ ఎన్నిక ప్రచారంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, భట్టి విక్రమార్క ఎంతో ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారో.. వారి కంటే ఎక్కువగా నిరుద్యోగ యువతి బర్రెలక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిరుద్యోగుల ప్రతినిధిగా బర్రెలక్క ఎన్నికల బరిలోకి దిగారు. ఆమెకు భారీగా మద్దతు రావడంతో ప్రచారం ముమ్మరం చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల పక్షాణ పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నారు. అసలీ బర్రెలక్క ఎవరో తెలుసుకుంద్దాం. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. అయితే పేపర్ల లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదా పడడంతో నిరాశ చెందింది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్దు బర్లను కాస్తూ ఓ వీడియో చేసింది.

"హాయ్ ఫ్రెండ్స్.. ఎన్ని డిగ్రీలు చేసినా ఉద్యోగం రావడం లేదు. మాయమ్మను అడిగి నాలుగు బర్లు కొన్న. ఉదయం, సాయంత్రం ఆరు లీటర్ల పాలు ఇస్తాయి" అని వీడియోలో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన వారు తనపై కేసు పెట్టారని బర్రెలక్క చెప్పింది. అయినా భయపడకుండా బర్రెలక్క పోరాటం చేస్తోంది.
ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బర్రెలక్క ఎన్నికల ప్రచార ఖర్చు కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాం వాసి మల్లాడి కృష్ణారావు రూ.లక్ష విరాళం పంపించారు. స్థానికంగ ఉన్న కొంతమంది చందాలు వేసుకుని బర్రెలక్క ప్రచారానికి సహకరిస్తున్నారు. బర్రెలక్క ఈ మధ్య పాట కూడా వచ్చింది. "కదిలే ఓ అడుగు యువతకు నువ్వు వెలుగు కదిలింది మన బర్రెలక్క అదిగో లేవర యువత" అంటూ ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications