వదల బొమ్మాలీ అంటూ భారీ వర్షాలతో బెదిరిస్తున్న బంగాళాఖాతం!
నైరుతి రుతుపవనాలకు తోడు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిస్సా దాని సమీపంలో ఛత్తీస్గడ్ ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణాలో మూడు రోజులు భారీ వర్షాలు
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పాటు అరేబియా సముద్ర తీరం నుంచి చత్తీస్గడ్ మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, దీని కారణంగా నేడు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం పేర్కొంది.

ఈ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో తాజా వాతావరణశాఖ హెచ్చరికలతో మూడు రోజులపాటు ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వాతావరణ కేంద్రం ప్రకటించిన ప్రకారం నేడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు ఇవే
మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని imd పేర్కొంది.
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఇలా
ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్ వంటి కొన్ని చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాదులోనూ పలు ప్రాంతాలలో వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications