హెచ్చరిస్తున్న బంగాళాఖాతం.. మళ్ళీ ఈ జిల్లాల్లో భారీవర్షాలు!

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. ఒకపక్క చలికాలం కొనసాగుతున్నా, వర్షాలు మాత్రం ఆగటం లేదు. ఇప్పటికే నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తుంటే, మళ్ళీ త్వరలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం
అక్టోబర్ 24వ తేదీన అల్పపీడనం ఏర్పడి, ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి అక్టోబర్ 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Bay of Bengal warns of heavy rains in these districts again

తెలంగాణాలో నేడు వర్షాలు కురిసే జిల్లాలివే
ఇదిలా ఉంటే ఈరోజు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన
అక్టోబర్ 19వ తేదీన రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

వర్షాల వేళ ప్రజలకు సూచనలు
వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయదారులు పంట విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తోంది. వర్షాలు పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి చలికాలంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో చలి కూడా గతం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+