నాలుగురోజులు వర్షాలు తధ్యమన్న బంగాళాఖాతం.. ఈ జిల్లాలకే హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

నాలుగురోజుల పాటు భారీవర్షాలు
దీంతో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Bay of Bengal warns of rains for four days Warning for these districts of telangana

ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్
ఈ క్రమంలో వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను, ఇతర జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గినట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాదులో 33.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లుగా పేర్కొంది.

ఈ జిల్లాలలో వర్షాలు
రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, జగిత్యాల, వికారాబాద్, కొమరం భీమ్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణాలో పది జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
సగటున గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలను నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్ తదితర ప్రాంతాలలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+