బిసి జర్నలిస్టుల సదస్సు.!ముఖ్య అతిధిగా హాజరు కానున్న ఈటెల రాజేందర్.!
హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 23న విశ్వేశ్వరయ్య భవన్ లో తలపెట్టిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనానికి హుజురాబాద్ బీజీపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆహ్వానించారు బీసీ సమాజ్ జర్నలిస్టు నాయకులు. ఈ సమావేశానికి హాజరవుతా నని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందని, బీసీలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని బీసీ టైమ్స్ ఎడిటర్, బీసీ సమాజ్ అధ్యక్షులు సంగెం సూర్యారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితుల్లో ఏమీ మార్పు రాలేదని, ఉద్యోగ భద్రత లేదని, మేనేజ్మెంట్ భరోసా లేదని, భవిష్యత్ పై ఆశలు కూడా లేకుండా పోయిందని అన్నారు.

మొట్టమొదటి సరిగా బిసి జర్నలిస్టుల కొరకు ఏప్రిల్ 23వ తేదిన దాదాపు 2 వేల మంది బిసి జర్నలిస్టులతో సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు భవిష్యత్తులో బిసి జర్నలిస్టుల సమస్యలపై ఏర్పడబోయే వేదిక ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. మరోవైపు తెలంగాణ సమాజం వర్గాల వారిగా, కులాల వారిగా విడిపోయినట్లు కాకుండా కలిసి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ జర్నలిస్టులందరినీ ఏకతాటిపై తీసుకురావాలన్నదే తమ ప్రయత్నమన్నారు.

తెలంగాణలో బీసీ జర్నలిస్ట్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తోపాటు, వారికి భద్రతా.. భరోసా.. భవిష్యత్తు...పై ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించాలనే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీసీ టైమ్స్ సీఈఓ, బీసీ సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ పరిమళ, అపెక్స్ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమాల్ తదితరులు పాల్గొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications