బీర్ అమ్మకాల్లో బిగ్ ట్విస్ట్, ఇక కష్టమే..!!
వేసవి తీవ్రత పెరుగుతోంది. మద్యం అమ్మకాల్లో బీర్లకు డిమాండ్ అదే స్థాయిలో ఉంది. కొద్ది రోజు లుకా బీర్ సేల్స్ రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో బీర్ల విక్రయాలు 22 శాతం మేర పెరిగాయి. నిరుడు మార్చిలో 39లక్షల బీర్ కేసులు అమ్ముడుపోగా.. ఈ మార్చిలో రికార్డు స్థాయిలో 50.78లక్షల కేసులు అమ్ముడయ్యాయి. గత ఐదేళ్లలో ఇవే అత్యధికం. కాగా.. వచ్చే నెలలో బీర్లకు కొరత ఏర్పడే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 21లక్షల కేసుల విక్రయాలు జరగడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు సగటున 1.70లక్షల నుంచి 1.80లక్షల వరకు బీరుకేసులు అమ్ముడుపోతున్నాయి. జనవరి నుంచే బీర్ల అమ్మకాల్లో పెరుగుల కనిపించింది. నిరుడు జనవరిలో 31లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ జనవరిలో అవి 34 లక్షలకు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 28లక్షల కేసులు మాత్రమే అమ్ముడవగా.. ఈ సారి ఏకంగా 38లక్షల కేసుల విక్రయాలు జరిగాయి. ఎండలు ముదురుతుండటంతో ఫిబ్రవరి చివరి వారం నుంచి బీర్ల విక్రయాలు మరింత పెరిగాయి. మే నెలలో ఇంకా బీర్ల వాడకం పెరిగి.. నీటి కొరత ఏర్పడితే ఉత్పత్తి పడిపోయి బీర్లకు కొరత ఏర్పడే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖ అంచనావేస్తోంది.

వచ్చే నెలలో కొరత ఏర్పడుతుందనే అంచనాలు
బీర్ల తయారీ పరిశ్రమల్లో చాలా వరకు మంజీర నీటిపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం ఆ నదిలో నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో బీరు తయారీ యూనిట్లకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఉత్పత్తి తగ్గితే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ కొరత లేకుండా మద్యం డిపోల నుంచి దుకాణాలకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు గత ఏడాదితో పోల్చితే.. 10 నుంచి 12 శాతం అదనపు ఉత్పత్తిని సాధించేలా ఎక్సైజ్‌శాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వేసవి కాలంలో గోదాముల్లో 15 రోజులకు సరిపడ స్టాక్ ఉంచుతారు. ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా ఎక్కడా కొరత రాకూడదనే ఉద్దేశంతో ఏకంగా 35 రోజులకు సరిపడా నిల్వలను గోదాముల్లో నిల్వ ఉంచారు. అయినా.. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల డిమాండ్‌కు తగ్గట్లు భవిష్యత్తులో అందించడం కష్టతరమే అవుతుందని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications