భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.. బెట్టింగ్ ఉచ్చులో యువత.. ఒక్కసారి దిగితే..
"రూపాయి.. రూపాయి నువ్ ఏం చేస్తావని అడిగితే.. హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను. భార్యభర్తల మధ్య చిచ్చు పెడతాను. తండ్రీ బిడ్డల్ని విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడదీస్తాను అందట..!" ఇది ఓ సినిమాలోని డైలాగ్ అయినా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. కష్టపడి పనిచేయకుండా ఈజీ మనీకి అలవాటుపడిన నేటి యువత.. బెట్టింగ్స్ మాయలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
బెట్టింగ్స్ యాప్స్ కు బలై ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ బెట్టింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. వేలాది మంది పిల్లలు బెట్టింగ్ కు బానిసలై లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. పదుల సంఖ్యలో అమాయకులు ఈ యాప్స్ కు మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

తెలిసీతెలియని వయసులోనే చేతికి సెల్ ఫోన్. అందులో ఫుల్ నెట్ బ్యాలెన్స్. ఇంకేముంది.. పిల్లలు చదువులు పక్కన పెట్టి ఈ మాయాలోకంలోకి ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ భూతం చేతిలో ఎవరి పిల్లలు ఉన్నారో తమ తల్లిదండ్రులకే తెలియదు. ఇది వింటానికే భయంగా అనిపిస్తోంది. పైకి చదువుకుంటూన్నట్లే కనిపించినా.. ఓ పిల్లాడు ఏ బెట్టింగ్, లోన్ యాప్స్ కు మోసపోతున్నాడో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలపై పెద్దలు ఓ కన్నేయకపోతే వారి భవిష్యత్తును మనమే చేజేతులా నాశనం చేసినవాళ్లం అవుతాం. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ లోకి ఎలా లాగుతారు..? యువత ఎలా మోసపోతోంది..? ఎలాంటి చర్యలు అవసరం..?

ఎరక్క పోయి ఇరుక్కోవద్దు..
జియో వినియోగం ప్రారంభం నాటి నుంచి దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. కరోనా తర్వాత ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. నిండా 15 ఏళ్లు లేని పిల్లలకూ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ కనబడుతోంది. ఇక అందులో బోలెడు యాప్స్ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ కు ఈ సోషల్ మీడియా యాప్స్ మెయిన్ ఫ్లాట్ ఫామ్. బెట్టింగ్ యాప్స్.. ఆయా సోషల్ మీడియా యాప్స్ ద్వారా యాడ్స్ ఇస్తుంటాయి. వాటి గాలంలో ఎవరైనా చిక్కుతారా అని ఎదురుచూస్తుంటాయి. బెట్టింగ్ పెట్టండి.. నిమిషాల్లోనే లక్షల రూపాయలు గెలుచుకోండి అని ఊరిస్తూ ఊబిలోకి దించుతాయి. ఒక్క క్లిక్ చేస్తే ఖేల్ ఖతం అన్నట్లే. దారుణమైన విషయం ఏంటంటే.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రొమోట్ చేయడానికి సినిమా స్టార్లు, క్రికెటర్లను, ఇతర ప్రముఖులను ఉపయోగిస్తుంటాయి. దీంతో యువత ఈజీగా ఈ బెట్టింగ్ యాప్స్ వలకు చిక్కిపోతున్నారు.

ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్లు చెప్పారని.. ఈజీగా ఇంట్లోనే కూర్చుని లక్షలు సంపాదించొచ్చని ఆశతో యువత బెట్టింగ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటారు. యాప్ స్టోర్, వెబ్‌సైట్, థర్డ్ పార్టీ సైట్ల నుంచి యాప్ ఇన్ స్టాల్ చేస్తారు. ఆ తర్వాత అందులో అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇందుకోసం వ్యక్తిగత వివరాలన్నీ ఇవ్వాలి. పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్.. ఇలా ఆ యాప్ ఏది అడిగితే అది సమర్పిస్తారు. చివరగా షరతులన్నీ అంగీకరిస్తున్నానని ఓ ఆప్షన్ వస్తుంది.. ఆ బటన్ క్లిక్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు చెల్లింపులు ఎలా చేస్తారో (క్రెడిట్/డెబిట్ కార్డ్, ఇ-వాలెట్‌లు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ ఫర్) తెలియజేయాల్సి ఉంటుంది.

వ్యక్తిగత సమాచారం అప్ లోడ్ చేశాక.. ఇక బెట్టింగ్ లోకి దిగుతారు. ఆ యాప్ ను బ్రౌజ్ చేసి అందులో ఏయే రకాల బెట్టింగ్ లు అందుబాటులో ఉన్నాయో చూస్తారు. క్రికెట్, కాసినో, ఇతర క్రీడలు, ఇంకా ఎలక్షన్స్ ఫలితాలు ఇలా ఒక్కటేమిటి అనేక రకాల ప్లాట్ ఫామ్స్ ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉంటాయి. అందులో ఏ విభాగంలో బెట్టింగ్ పెడతారో సెలక్ట్ చేసుకుంటారు. ఎంత డబ్బు బెట్టింగ్ పెట్టాలో నిర్ణయించుకొని బెట్టింగ్ పెడతారు.
బెట్టింగ్ యాప్ ట్రిక్స్ ఇవే..
బెట్టింగ్ యాప్స్ యువతను అనేక రకాలుగా మోసం చేస్తాయి. వీటిని ఎవరు సృష్టించారో తెలియదు. ఎవరు మేనేజ్ చేస్తున్నారో అర్థం కాదు. అయితే బెట్టింగ్ యాప్స్.. యువతను మాయ చేసే పనిలో భాగంగా మొదట.. వాళ్లకు నమ్మకం కలిగేలా చేస్తాయి. స్టార్టింగ్ లో యూజర్లకు గెలుపు రుచి చూపిస్తాయి. అంతేకాక ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి ఊరిస్తాయి. మాయమాటలు చెప్పి ముందుగా ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయించుకుంటాయి. ఆ తర్వాత పలు రకాల కారణాలు చూపి డబ్బును మోసగిస్తాయి. ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి.
#SayNoToBettingApps @Cyberdost @AmitShah @narendramodi pic.twitter.com/zb1HYbXaKP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025
ఇక కొన్ని బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తాయి.అకౌంట్ క్రియేట్ చేసే సమయంలోనే యూజర్ల పర్సనల్ సమాచారాన్ని తీసుకుంటాయి. ఆ తర్వాత ఫోన్ మొత్తం హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి క్షణాల్లో అకౌంట్ ఖాళీ చేస్తాయి. ఇక మరో రకం నకిలీ గేమింగ్ యాప్స్. ఇవి పూర్తిగా మోసగించేవి. ఇందులో ఆటలన్నీ ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. అందువల్ల యూజర్లు గెలవడం అనేది ఎప్పుడూ జరగదు. ఇలా రకరకాలుగా యువతను మోసం చేస్తాయి యాప్స్.
ఈ బెట్టింగ్ యాప్స్ పై తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో కొరడా ఝుళిపించాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్స్ పైన పూర్తి నిషేధం ఉంది. అంతేకాక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ యాప్స్ బ్యాన్ అయ్యాయి. అయినప్పటికీ ఆన్ లైన్ ద్వారా సీక్రెట్ గా ఈ వ్యవహారం నడిపిస్తున్నాయి. ఇలాంటి యాప్స్ ను సినీ తారలు కూడా ప్రొమోట్ చేయడంతో వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
#SayNoToBettingApps https://t.co/reew5zFB2C
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 19, 2025
ఈ యాప్స్ కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలుమార్లు యువతకు సూచించారు. అంతేకాక బెట్టింగ్ నిర్వహించిన వారు మాత్రమే కాకుండా ప్రమోట్ చేసినవాళ్లకు కూడా శిక్ష తప్పదని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications