Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సజ్జనార్ చెప్పారంటే..హైదరాబాద్ వాహనదారులు అలర్ట్ కాక తప్పదు

వాహనదారులకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పలు సూచనలు చేశారు. అనేక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించాలని సూచించారు. ఎటువంటి మోసాలకు గురి కావొద్దని, అలాంటి వారి బారిన పడొద్దని, డబ్బులు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి నేరాలు అధికమౌతోన్నాయని, వీటి గురించి నగర పోలీసులు పదే పదే సూచనలు చేస్తోన్నప్పటికీ- అవి పునరావృతమౌతున్నాయని గుర్తు చేశారు.

నకిలీ ఈ-చలాన్ లింకుల ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు చోరీ అవుతున్నాయని సజ్జనార్ అన్నారు. చలాన్ పెండింగ్ అంటూ ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలు, అధికారిక సైట్‌లను పోలిన లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో నకిలీ ట్రాఫిక్ చలాన్ మోసాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని సజ్జనార్ చెప్పారు. హెచ్చరికలు జారీ చేసినప్పటికీ చాలామంది వాహనదారులు, పౌరులు ఈ వలలో పడుతున్నారని అన్నారు.

Beware of Fake Traffic Challan Scams in Hyderabad Protect Your Bank Details Sajjanar suggested

ఎస్ఎంఎస్ ద్వారా ఫిషింగ్ లింక్‌లు పంపి, నకిలీ సైట్‌లకు దారి మళ్లిస్తారని, ప్రజలు నిజమైనవిగా భావించి వివరాలు ఇవ్వగానే, బ్యాంకు ఖాతాలు తక్షణమే ఖాళీ అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లు '.gov.in' లేదా '.org' తో ముగుస్తాయని, ఎస్ఎంఎస్ లింక్‌లతో చెల్లింపులు జరపొద్దని అన్నారు. అధికారిక ఈ-చలాన్ సైట్‌లో మాత్రమే వివరాలను పొందుపర్చాలని సూచించారు. ఈ లింకులు క్లిక్ చేస్తే మాల్వేర్ ఇన్‌స్టాల్ కావచ్చు లేదా బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా చోరీకి గురి అయ్యే ప్రమాదం ఉంది.

ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని, ప్రభుత్వ విభాగాలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింక్‌లను ఎప్పటికీ పంపబోవని వివరించారు. ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపర్చవద్దని, యాప్‌లను అధికారిక ప్లేస్టోర్‌ నుండి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సజ్జనార్ అన్నారు.

మొబైల్ ఫోన్‌ను ఎప్పుడూ భద్రతా ప్యాచ్‌, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్‌లో ఉంచాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే మొబైల్ డేటా/వైఫై డిస్‌కనెక్ట్ చేసి బ్యాంకులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. లావాదేవీలు/కార్డులను బ్లాక్ చేయాలి. 1930కు డయల్ చేయాలి. www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని, లేదా దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+