చరిత్ర సృష్టించిన భారత్ బయోటెక్.. మహమ్మారి అంతానికి మరో వ్యాక్సిన్.. ట్రయల్ రన్ సక్సెస్
హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే కొవిడ్-19 వైరస్ కొవాగ్జిన్ టీకాను తీసుకొచ్చింది. భారత్ తోపాటు ప్రపంచ దేశాలకు సరఫరా చేసి ఔరా అనిపించింది. కొవాగ్జిన్ తో పాటు.. హెచ్1ఎన్1 వైరస్ కు టీకా, డెంగ్యూ, రోటా వైరస్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, రేబీస్, టైఫాయిడ్.. లాంటి వ్యాధులకు టీకాలు అభివృద్ది చేసింది. ప్రపంచ దేశాల వ్యాక్సిన్ తయారీ సంస్థలకు భారత్ బయోటెక్ దిక్సూచిగా నిలిచింది. అయితే తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది భారత్ బయోటెక్.
హైదరాబాద్ కు ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ మరోసారి చరిత్ర సృష్టించింది. కలరా నియంత్రణ కోసం సంస్థ కొత్తగా హిల్ కాల్ అనే టీకాను అభివృద్ధి చేసింది. తాజాగా ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు విజయవంతం అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ హిల్ కాల్ వ్యాక్సిన్ మార్కెట్ లోకి రానుంది.

కలరా నియంత్రణ కోసం హిల్ కాల్ అనే కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది భారత్ బయోటెక్. ఈ టీకా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయింది. కలరాను వ్యాప్తి చేసే ఒగావా, ఇనబా సెరో టైప్ బ్యాక్టీరియాలను నియంత్రించడంలో ఈ టీకా సమర్థవంతంగా పనిచేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని భారత్ బయోటెక్ సంస్థ పరిశోధకులు తెలిపారు.
కలరాను నియంత్రించే హిల్ కాల్ టీకా ప్రత్యేకత ఏంటంటే.. నోటి ద్వారా తీసుకునే కలరా టీకా(ఓరల్ కలరా వ్యాక్సిన్)ఇది. ఈ వ్యాక్సిన్ ద్వారా కలరా మహమ్మారి నుంచి పెద్దలు, పిల్లలను కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కలరా వ్యాధిని హిల్ కాల్ టీకా ద్వారా అదుపు చేయొచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తాజాగా వివరించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications