పీవీకి భారతరత్న.. ఎన్టీఆర్ కోసం విజయశాంతి ఆసక్తికర పోస్ట్!!
కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న మాజీ ప్రధాన మంత్రి, దివంగత పీవీ నరసింహరావు సహా మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ కు, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.
తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీ నరసింహారావు గారికి ఇలాంటి గౌరవం దక్కిన చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇదే సమయంలో విజయశాంతి ఆసక్తికర డిమాండ్ ను చేశారు. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండకపోవచ్చు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC
— VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024
ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాననని విజయశాంతి పేర్కొన్నారు. అందుకు అందరూ కలిసి రావాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
భారత రత్న వంటి అత్యున్నత గౌరవ పురస్కారం నందమూరి తారకరామారావు గారికి దక్కితే బాగుంటుందని ఈ మేరకు కేంద్రం ముందు తన డిమాండ్ ను ఉంచారు. ఈ డిమాండ్ గతంలో కూడా వినిపించింది. అంతేకాదు గతంలో తాను ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డును తీసుకున్న ఫోటోలు తన పోస్టుకు జత చేశారు విజయశాంతి.












Click it and Unblock the Notifications