"హైదరాబాద్ డెవలప్ మెంట్ కు ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు"
హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన తెలంగాణ 15వ NAREDCO ప్రాపర్టీ షోను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్ లో రూ. 10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీవరేజ్ ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం రూ. 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ వేలంలో ఎకరం రూ. 177 కోట్లు పలికిందంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇతర ఏ నగరంలో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతోందని స్పష్టం చేశారు. సీవరేజ్ ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం రూ. 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. అలాగే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు కల్పించామని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

" నెరెడ్కో ప్రతినిధులు ప్రభుత్వ CSR నిధులను విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో వినియోగించాలని సూచిస్తున్నా. విల్లాలు, హై రైజ్ భవనాలకే పరిమితం కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలి. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది. మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రి జూపల్లి.. తదితరులు పాల్గొన్నారు.
-
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?











Click it and Unblock the Notifications