Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్థానిక ఎన్నికలు ఆ నెలలోనే.. కేబినేట్ కీలక నిర్ణయం..

ఇవాళ జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు డిసెంబర్ లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

తెలంగాణలో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాలను జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ వారోత్సవాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలు.. ఇప్పటికే అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక ప్రజా పాలన వారోత్సవాల అనంతరం డిసెంబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్రం ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇక ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

BIG BREAKING Telangana Local Body Election Dates in 2nd Week of December

మరోవైపు మంత్రివర్గ సమావేశంలో పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, సీసీఐ విధించిన కొత్త నిబంధనలు చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సీసీఐ కొత్త నిబంధనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టిన విషయం తెలిసిందే. అలాగే సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశంలో మృతులకు నివాళి అర్పించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+