కవితకు బిగ్ షాక్.. ఆ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిక!

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కెసిఆర్ తనయ కవిత పైన, ఆమె మద్దతు ఇచ్చిన పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయకేతనం ఎగరవేయడం పైన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఊహించని షాక్ ఇచ్చారు.

ఆదిలోనే కవితకు ఎదురుదెబ్బ

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన ఈ కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. అదే గనక జరిగితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు అవుతుంది.

Big shock for Kavitha vaddepalli all india forward block councilors joining in congress party


కవిత మద్దతుతో గెలిచిన పార్టీ

తెలంగాణ జాగృతి మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసింది. కవిత వారికి మద్దతు ప్రకటించి మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయాన్ని సాధించి మున్సిపల్ చైర్మన్ పదవిని ఖరారు చేసుకుంది.

కాంగ్రెస్ లో చేరనున్న కౌన్సిలర్ లు

రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కొత్త పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమైంది. అయితే దీనికంతటికీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. ఇక ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాయకత్వంలో గెలిచిన ఈ ఎనిమిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

కవితకు మింగుడు పడని నిర్ణయం

వడ్డేపల్లిలో వీరి విజయం తర్వాత కవిత పేరు తెరమీదకు రావడంతో తమకు కవితతో ఎటువంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. ముందు వీరు కవితను కలిసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు తమతోనే ఉన్నారని కవిత తెలిపారు. ఇక ప్రస్తుతం వీరంతా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవడం, వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయడం కవితకు మింగుడు పడని అంశం. మరి అదే గనుక జరిగితే కవిత రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+