మీకు మీరే.. మాకు మేమే: తెలంగాణా బీజేపీకి పెద్ద కష్టమే!!
తెలంగాణ కమలం పార్టీలో ముసలం పుట్టింది. బండి సంజయ్ కు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు పాటు దూకుడు చూపించిన తెలంగాణ బిజెపి, ఆ తర్వాత అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్నా, రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నఅనేక సర్వేలు బిజెపి క్షేత్రస్థాయిలో కి వెళ్ళలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా బిజెపి నేతల ధోరణిలో మాత్రం మార్పు రాలేదు.
ఇక తాజాగా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి నలుగురు ముఖ్య నేతలు హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న నలుగురు పదాధికారుల సమావేశానికి గైర్హాజరయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీంద్రనాథ్ రెడ్డి, విజయశాంతిలు పదాధికారుల సమావేశానికి మాత్రమే కాకుండా, ఇటీవల జరిగిన నరేంద్ర మోడీ పర్యటనలో కూడా కనిపించలేదు.

వీరు పార్టీ మీటింగ్లకు పెద్దగా హాజరు కాకపోవడంతో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వీరు పార్టీ మారే అవకాశం కూడా వుందని చర్చ జరుగుతుంది. ఏనుగు రవీంద్రనాథ్ రెడ్డి మినహాయించి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతిలు ఇటీవల వేసిన ఎన్నికల కమిటీలలో ఉన్నారు. కమిటీలను ప్రకటించినా వారు మాత్రం తమకేమీ సంబంధం లేదు అన్నట్టే వ్యవహరిస్తున్నారు.
అయినప్పటికీ వీరు పార్టీ మారతారు అన్న చర్చ, కిషన్ రెడ్డి నాయకత్వంపై వీరికి నమ్మకం లేదు అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుంది. ఒకపక్క తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎత్తులు వేయాల్సిన చోట కమలం పార్టీలో మాత్రం విభేదాల కుంపట్లు ఆగడం లేదు.
గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళు కాస్త యాక్టివ్ గానే పనిచేశారు. ఇక కిషన్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించిన తర్వాత వీరిలో అసహనం పీక్స్ కు చేరుకుంది. పార్టీపై నిరాశ నిప్సృహలతో ఉన్న ఈ నాయకులు భవిష్యత్ లో ఏం చేస్తారో అన్నది పార్టీలో చర్చనీయాంశం అవుతుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications