Ibomma రవి అరెస్ట్‌లో బిగ్ ట్విస్ట్
ఇంటర్నెట్‌లో పైరసీకి పర్యాయపదంగా మారిన ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. కొన్ని రోజులుగా పోలీసులకు సవాల్ విసురుతున్న ఐబొమ్మ నిర్వాహకులలో ఒకరైన రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే, అతని అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే, అతడు పోలీసులకు దొరికిపోవడానికి కారణం మరెవరో కాదు... అతని భార్యే.
ఐబొమ్మ సైట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, అరెస్ట్‌కు ముందు కెన్యాలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రవి, అతని భార్య మధ్య వ్యక్తిగత విభేదాలు, గొడవలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.ఈ విడాకుల ప్రక్రియ కోసమే రవి రహస్యంగా కెన్యా నుండి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ విషయంలో రవి ఎంత గోప్యత పాటించినా, అతని భార్య మాత్రం అతని కదలికలపై నిఘా ఉంచింది.

రవి హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న అతని భార్య... ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా పోలీసులకు సమాచారం అందించింది. తన భర్త ఎక్కడున్నాడనే పక్కా వివరాలను పోలీసులకు చేరవేసింది.
దీంతో, పైరసీ కేసులో రవి కోసం గాలిస్తున్న పోలీసులు తక్షణం రంగంలోకి దిగి, ఎటువంటి ప్రతిఘటన లేకుండా అతడిని అరెస్ట్ చేశారు. మొత్తానికి, పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకోవడానికి ఎన్నో వ్యూహాలు పన్నిన ఐబొమ్మ రవి... తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యల వల్లే, భార్య ఇచ్చిన సమాచారం వల్లే చట్టానికి చిక్కడం చర్చనీయాంశమైంది.
ఒక వైపు కోర్టులో విడాకుల పోరాటం నడుస్తుండగానే, మరో వైపు భార్య తీసుకున్న ఈ నిర్ణయం రవిని జైలు పాలు చేసింది. దీంతో, పైరసీ కేసులో కీలక ముద్దాయిని పట్టుకోవడంలో పోలీసులకు అతని భార్య అనుకోని విధంగా సహాయపడినట్లయింది.












Click it and Unblock the Notifications