Bigg Boss 5 Telugu: ఈ వారం కండలవీరుడు అవుట్: హౌస్‌లో హీరోగా నిలిచినా నో యూజ్
హైదరాబాద్: టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇవ్వాళ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే ఎనిమిదిమంది ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

ఎలిమినేషన్ లిస్ట్‌లో
ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో ఎలిమినేట్ అయ్యారు. టీవీ వీక్షకులు, అభిమానుల నుంచి వారికి పెద్దగా మద్దతు లభించలేదు. ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. అలాంటి కంటెస్టెంట్ ఇంకొకరు ఈ తొమ్మిదో వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఆ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది అధికారికంగా ఈ రాత్రికి తేలిపోతుంది. హోస్ట్ అక్కినేని నాగార్జున ఆ కంటెస్టెంట్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఆ కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం సోషల్ మీడియాలో ముందే లీక్ అయింది.

సేఫ్ జోన్‌లో ఎవరు?
ఈ వారం ఆరు మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి, సిరి హన్మంతు, ప్రియాంక అలియాస్ పింకీ, వీజే సన్నీ, జెస్సీ, ఆర్జే కాజల్, విశ్వ ఉన్నారు. వారిలో ఇద్దరు సేఫ్‌జోన్‌లో వెళ్లారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్ సందర్భంగా యాంకర్ రవి, సిరి హన్మంతు, సన్నీ సేఫ్ అయ్యారు. మిగిలిన వారు అన్‌సేఫ్‌గా మిగిలారు. ఈ అయిదు మందిలో ఎవరు హౌస్‌లో కంటిన్యూ అవుతారు?, ఎవరు బయటికి వెళ్తారనేది ఈ రాత్రికి తెలిసిపోతుంది.

విశ్వ అవుట్..
సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ వారం కండలవీరుడు విశ్వ.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. అతనికి వీక్షకుల నుంచి పెద్దగా ఓట్లు రాలేదు. హౌస్‌లో తోటి కంటెస్టెంట్ల నుంచి అతనికి మంచి సపోర్టే లభించింది. బిగ్‌బాస్ హౌస్‌లో హీరో ఎవరు?, విలన్ ఎవరు? అనే టాస్క్‌లో విశ్వకు త్రీస్టార్ వచ్చాయి. విలన్‌గా ఆర్జే కాజల్ నిలిచింది. జెంటిల్‌మెన్‌గా, గుడ్ హౌస్ క్లీనర్‌గా, ఓ మంచి కేర్ టేకర్‌గా విశ్వను తోటి కంటెస్టెంట్లు అభివర్ణించారు. అతనికి ముగ్గురు కంటెస్టెంట్లు తమ హీరోగా పోల్చారు. టాస్కుల్లోనూ హార్డ్ ఫైట్ చేస్తాడనే పేరుంది.

ఆ స్థాయిలోఓటింగ్ లేకపోవడమే..
తోటి కంటెస్టెంట్లు అతనికి అండగా నిలిచినా.. ఆ స్థాయిలో వ్యూవర్స్ వద్ద నుంచి ఓట్లు పడట్లేదు. ఈ వారం ఓట్లను సాధించిన వారి జాబితాలో అతి తక్కువ స్థాయిలో పర్సంటేజ్ నమోదైంది విశ్వ పేరు మీదే. అందుకే తొమ్మిదో ఎలిమినేటర్‌గా విశ్వ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. ఎలిమినేషన్ రౌండ్‌లో చివరి వరకు ఆర్జే కాజల్, విశ్వ నిలుస్తారని, అతని కంటే కొంత బెటర్‌గా ఓటింగ్ పర్సంటేజ్‌ను సాధించిన రేడియో జాకీ.. సేఫ్ అవుతారని సమాచారం.

ఆర్జే కాజల్ లేడీ విలన్..
హీరో ఎవరు? విలన్ ఎవరు? అనే టాస్క్‌లో ఆర్జే కాజల్ ఖల్ నాయకిగా నిలిచిన విషయం తెలిసిందే. మెజారిటీ కంటెస్టెంట్లు ఆమెను విలన్‌గా నామినేట్ చేశారు. ముఖం మీద రెడ్ మార్క్ వేయడం ద్వారా ఆమెను విలన్‌గా సెలెక్ట్ చేశారు. స్టార్స్ ఇవ్వడం ద్వారా విశ్వను హీరోను చేశారు. మూడు స్టార్లను విశ్వ సాధించాడు. అయినప్పటికీ- ఆర్జే కాజల్ కంటే తక్కువ ఓటింగ్ పర్సంటేజీని నమోదు చేశాడు ఈ ఫిట్‌నెస్ మోడల్. లోబో లేకపోవడం వల్ల కొంత డల్ అయ్యాడనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications