Bigg Boss 5 Telugu finale: టాప్ 3లో ఉన్నది వీరే: టైటిల్ కోసం ఈ ముగ్గురి మధ్యే టైట్ ఫైట్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కీలక దశకు చేరుకుంది. ఇదే చివరి వారం ఇంకో మూడు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ఈ సీజన్ హీరో ఎవరో తేలిపోతుంది. చివరి మూడు రోజులు కావడం వల్ల అందరి దృష్టీ బిగ్‌బాస్‌పైనే నిలిచింది. ఓట్ల శాతం గురించి హాట్ డిబేట్ సాగుతోంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద. ఈ టైటిల్ కోసం పోటీ పడ్డ 19 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ టైటిల్ వరిస్తుంది. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ఓ ప్లాట్ సొంతం అవుతుంది.

టాప్-5లో
ఈ సీజన్‌లో బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి కంటెస్టెంట్ల మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. చివరివారం టాస్క్‌లల్లో తమ టాలెంట్ మొత్తాన్నీ ప్రదర్శించేస్తోన్నారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, వీజే సన్నీ, మానస్ నాగుపల్లి, సిరి హన్మంతు మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ అయిదుమందిలో విన్నర్‌గా నిలిచేది మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరనేది ఆదివారం రాత్రి నాటికి అధికారికంగా తేలిపోతుంది. టాప్ 3లో ఎవరు నిలుస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. ఎవరికి తోచిన విధంగా వారు అంచనాలు వేస్తోన్నారు.

ఓటింగ్‌లో టాప్‌లో..
ఈ వారం ఓటింగ్‌లో వీజే సన్నీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. రెండోస్థానంలో ఉన్న కంటెస్టెంట్‌తో కంపేర్ చేసి చూస్తే..ఓట్ల మధ్య తేడా భారీగా ఉంటోంది. 10 వేలకు పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఓటింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మరిన్ని ఓట్లు పోల్ కానున్నందున.. పొజీషన్లు తారుమారు కావనే గ్యారంటీ లేదు. ఎటొచ్చీ- ఈ సీజన్ ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫిమెల్ కంటెస్టెంట్ సిరి హన్మంతు.. చివరిలో నిలిచారు. ప్రస్తుతం ఆమెకు ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. తొలి మూడు స్థానాల్లో చోటు దక్కించే అవకాశాలు దాదాపు లేనట్టే.

ఇవ్వాళ్టి ఓట్ల శాతం ఇలా..
ఇప్పుడున్న ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే.. వీజే సన్నీ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోన్నాడు. అతనికి పోల్ అయిన ఓట్లు 49,235. మొత్తం పడిన ఓట్లల్లో సన్నీకి దక్కినవి 51.47 శాతం. రెండో స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. అతనికి పడ్డ ఓట్ల శాతం 32.47. మొత్తంగా 30,787 ఓట్లు పడ్డాయి. శ్రీరామచంద్ర మూడో స్థానంలో ఉన్నాడు. అతనికి 9,224 ఓట్లు పోల్ అయ్యాయి. 9.73 శాతం మంది అతనికి అనుకూలంగా ఓటు వేశారు. చివరి రెండు స్థానాల్లో మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు నిలిచారు. మానస్-3,300, సిరి-2,264 ఓట్లను సాధించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

టఫ్ ఫైట్ ఈ ముగ్గురి మధ్యే..
వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, శ్రీరామచంద్ర.. టాప్-3లో నిలిచారు. మానస్, సిరికి పడ్డ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ముగ్గురిని దాటుకుని టాప్‌లోకి రావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఈ పరిస్థితుల్లో వీజే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. గ్రాండ్ ఫినాలె గడువు సమీపించే సమయానికి ఈ ముగ్గురి ఓట్ల సంఖ్య మరింత పెరగడం ఖాయం. అది టఫ్ ఫైట్‌కు దారి తీయవచ్చు. ఇప్పుడున్న ఓట్ల ట్రెండింగ్ ఇలాగే కొనసాగితే.. బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ విన్నర్‌గా వీజే సన్నీ ఆవిర్భవిస్తాడు. అతడి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.

దీప్తి సునయన ఆదుకుంటుందా?
ఈ ఓటింగ్ రిజల్ట్స్ చూసిన తరువాత.. షణ్ముఖ్ జశ్వంత్ లవర్ దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చారు. ఓటింగ్‌లో షన్ను వెనుకంజలో ఉండటంతో అతన్ని ఒడ్డున పడేయడానికి తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాను షన్నును సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించారు. బిగ్‌బాస్ వ్యూవర్స్‌ను కన్విన్స్ చేసేలా ఇన్‌స్టా పోస్ట్ చేశారు. షణ్ముఖ్ జశ్వంత్ వ్యక్తిత్వం గురించి తుది నిర్ణయం తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లో అతని ప్రవర్తనను చూసి.. వ్యక్తితాన్ని అంచనా వేయొద్దని కోరారు. ఇది ఓ షో మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications