Bigg Boss 5 Telugu Voting Results For Finale: ఓటింగ్‌లో అందనంత ఎత్తులో ఉన్న డాషింగ్ కంటెస్టెంట్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కీలక దశకు చేరుకుంది. ఇదే చివరి వారం ఇంకో మూడు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ఈ సీజన్ హీరో ఎవరో తేలిపోతుంది. చివరి మూడు రోజులు కావడం వల్ల అందరి దృష్టీ బిగ్‌బాస్‌పైనే నిలిచింది. అందులోనూ ఓట్ల శాతం గురించి హాట్ డిబేట్ సాగుతోంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద. ఈ టైటిల్ కోసం పోటీ పడ్డ 19 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ టైటిల్ వరిస్తుంది. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ఓ ప్లాట్ సొంతం అవుతుంది.

సరయు నుంచి కాజల్ దాకా..
మొత్తం 19 మందితో మొదలైన సీజన్ ఇది. 14 వారాల్లో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ఒక్క జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ మినహా.. మిగిలిన వారందరూ కూడా తక్కువ ఓట్ల శాతాన్ని అందుకోవడం వల్ల బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. యూట్యూబర్ సరయుతో ఎలిమినేషన్ ఆరంభమైంది.. ఆర్జే కాజల్‌తో ముగిసింది. సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత యానీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు.

ఊహించని విధంగా..
ఎవరూ ఊహించని విధంగా టఫ్ కాంపిటీటర్‌గా భావించిన యాంకర్ రవి సైతం హౌస్‌ను వీడాల్సి వచ్చింది. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యే సమయానికి అతని తోటి కంటెస్టెంట్ వీజే సన్నీ వద్ద ఎవిక్షన్ పాస్ ఉన్నప్పటికీ.. అది ఉపయోగపడలేదు. రవి ఎలిమినేషన్‌ను అడ్డుకోలేదు. ఆల్‌రెడీ సేఫ్ జోన్‌లో ఉన్న కాజల్ కోసం సన్నీ.. ఎవిక్షన్ పాస్‌ను ఉపయోగించాడు. అక్కడ లాజిక్‌గా ఆలోచించి.. ఈ పాస్‌ను రవి కోసం శాక్రిఫై చేసి ఉంటే.. కథ మరోలా ఉండేది. రవి తరువాత- ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.. ఎలిమినేట్ అయ్యారు. చివరి వారం కాజల్‌తో ఈ ప్రాసెస్ ముగిసింది.

టాప్-5లో ఉన్నది వీరే..
గ్రాండ్ ఫినాలెకు ముందు వారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యారు. ఆమె పెర్‌ఫార్మెన్స్ ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా సాగింది. టాస్కుల్లోనూ ఆమె తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయారు. ఇంటి బాట పట్టారు. ఇన్నిరోజులు కొనసాగడమే గొప్ప అనే నెటిజన్లు, వీక్షకులు కూడా లేకపోలేదు. పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి కాజల్ తప్పుకొన్నారు. ఆమె ఎలిమినేషన్ తరువాత- శ్రీరామచంద్ర, వీజే సన్నీ, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్..చివరిలో మానస్ నాగులపల్లి తొలి అయిదుమందిలో చోటు దక్కించుకున్నారు.

లీస్ట్‌లో సిరి..
ఈ అయిదుమందిలో మొదట సిరి హన్మంతు ఎలిమినేట్ అవ్వొచ్చు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 ఫైనల్‌కు అర్హత సాధించిన ఫిమేల్ కంటెస్టెంట్‌కు అతి తక్కువ ఓట్లు పడ్డాయి. మిగిలిన నలుగురితో కంపేర్ చేస్తే అతి తక్కువ ఓట్ల శాతాన్ని అందుకున్నారామె. ఈ లిస్ట్‌లో లీస్ట్‌లో ఉన్నారు. ఆమె కంటే ముందు వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి ఉన్నారు. సిరి హన్మంతు, మానస్ నాగులపల్లి టాప్-3లో కూడా ఉండకపోవచ్చు.. ఇప్పుడు ఉన్న ఓట్ల ట్రెండింగ్ ఇలాగే కొనసాగితే. ఊహించినట్టే టాప్-3లో మేల్ కంటెస్టెంట్సే ఉంటారని ప్రచారానికి ఈ ఓట్లు మరింత బలాన్ని ఇస్తోన్నాయి.

ఓట్ల పర్సెంటేజ్ ఇలా..
ఈ వారం ఓటింగ్‌లో వీజే సన్నీ దుమ్ము దులుపుతున్నాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి పోల్ అయిన ఓట్లు 15,337. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తం పడిన ఓట్లల్లో సన్నీకి దక్కినవి 53.69 శాతం. రెండో స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. అతనికి 28.72 శాతంతో 8,204 ఓట్లు పడ్డాయి. సిరి హన్మంతుకు 11.14 శాతంతో 3,183 ఓట్లు పోల్ అయ్యాయి. మానస్ నాగులపల్లికి 1,186 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఓట్ల శాతం 4.15. సిరి హన్మంతు చివరి స్థానంలో నిలిచారు. 2.29 శాతం ఓట్లు వచ్చాయి. వీటి సంఖ్య 655 మాత్రమే. ఇంకా సమయం ఉన్నందున ఈ అయిదుమందికి మరిన్ని ఓట్లు పోల్ అవుతాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications