Bigg Boss 5 Telugu finale: అతని క్యారెక్టర్ అలాంటిది: లవర్ కోసం సరికొత్తగా క్యాంపెయిన్

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కీలక దశకు చేరుకుంది. ఇదే చివరి వారం ఇంకో మూడు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ఈ సీజన్ హీరో ఎవరో తేలిపోతుంది. చివరి మూడు రోజులు కావడం వల్ల అందరి దృష్టీ బిగ్‌బాస్‌పైనే నిలిచింది. అందులోనూ ఓట్ల శాతం గురించి హాట్ డిబేట్ సాగుతోంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద. ఈ టైటిల్ కోసం పోటీ పడ్డ 19 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ టైటిల్ వరిస్తుంది. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ఓ ప్లాట్ సొంతం అవుతుంది.

Recommended Video

    Bigg Boss Telugu 5 : షన్ను, సిరి మధ్య దూరం... దూరం...! || Oneindia Telugu
    ఓటింగ్‌ ఎవరి పొజీషన్ ఎలా..

    ఓటింగ్‌ ఎవరి పొజీషన్ ఎలా..

    ఈ అయిదుమందిలో మొదట సిరి హన్మంతు ఎలిమినేట్ అవ్వొచ్చు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 ఫైనల్‌కు అర్హత సాధించిన ఫిమేల్ కంటెస్టెంట్‌కు అతి తక్కువ ఓట్లు పడ్డాయి. మిగిలిన నలుగురితో కంపేర్ చేస్తే అతి తక్కువ ఓట్ల శాతాన్ని అందుకున్నారామె. ఈ లిస్ట్‌లో లీస్ట్‌లో ఉన్నారు. ఆమె కంటే ముందు వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి ఉన్నారు. సిరి హన్మంతు, మానస్ నాగులపల్లి టాప్-3లో కూడా ఉండకపోవచ్చు.. ఇప్పుడు ఉన్న ఓట్ల ట్రెండింగ్ ఇలాగే కొనసాగితే. ఊహించినట్టే టాప్-3లో మేల్ కంటెస్టెంట్సే ఉంటారని ప్రచారానికి ఈ ఓట్లు మరింత బలాన్ని ఇస్తోన్నాయి.

    ఓట్ల పర్సెంటేజ్ ఇలా..

    ఓట్ల పర్సెంటేజ్ ఇలా..

    ఈ వారం ఓటింగ్‌లో వీజే సన్నీ దుమ్ము దులుపుతున్నాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి పోల్ అయిన ఓట్లు 15,337. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తం పడిన ఓట్లల్లో సన్నీకి దక్కినవి 53.69 శాతం. రెండో స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. అతనికి 28.72 శాతంతో 8,204 ఓట్లు పడ్డాయి. సిరి హన్మంతుకు 11.14 శాతంతో 3,183 ఓట్లు పోల్ అయ్యాయి. మానస్‌ నాగులపల్లికి 1,186 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఓట్ల శాతం 4.15. సిరి హన్మంతు చివరి స్థానంలో నిలిచారు. 2.29 శాతం ఓట్లు వచ్చాయి. వీటి సంఖ్య 655 మాత్రమే. ఇంకా సమయం ఉన్నందున ఈ అయిదుమందికి మరిన్ని ఓట్లు పోల్ అవుతాయి.

    సిరి-షన్ను రొమాన్స్‌పై..

    సిరి-షన్ను రొమాన్స్‌పై..

    బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని వారాలుగా షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంతు చాలా క్లోజ్‌గా ఉంటోన్నారనేది బహిరంగ రహస్యం. చాలా ఎపిసోడ్స్‌లో ఇది స్పష్టమైంది కూడా. షన్ను వెంటే సిరి అన్నట్టుగా కనిపించారు వారిద్దరు. చాలా టాస్క్‌లల్లో వారిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. హగ్గులు, ముద్దులతో కనిపించారు. ఈ వ్యవహారం అటు దీప్తి సునయన అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్లలోనూ కొంత అసహనానికి, అసంతృప్తికి దారి తీసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. షన్నును సపోర్ట్ చేసే విషయంలో ఆమె కొద్దిరోజులు మౌనంగా ఉన్నట్లు కనిపించారు. తాజా ఓటింగ్ రిజల్ట్స్ చూసిన తరువాత.. తన మనసు మార్చుకున్నారు. క్యాంపెయిన్ మొదలు పెట్టారు.

    షణ్ముఖ్ కోసం లవర్..

    షణ్ముఖ్ కోసం లవర్..

    ఈ ఓటింగ్ రిజల్ట్స్ చూసిన తరువాత.. షణ్ముఖ్ జశ్వంత్ లవర్ దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చారు. ఓటింగ్‌లో షన్ను వెనుకంజలో ఉండటాన్ని ఆమె జీర్ణించుకోవట్లేదు. సిరి హన్మంతుతో సపరెట్‌గా లవ్ ట్రాక్‌ నడపించినట్లు అనుమానించిన ఆమె కొద్దిరోజుల పాటు మౌనంగా ఉన్నట్లు కనిపించారు. ఈ ట్రాక్- దీప్తి సునయన ఫాలోవర్లు, ఆమె ఫ్యాన్స్, షన్ను మీద అభిమానం పెంచుకున్న బిగ్‌బాస్ వీక్షకులు.. కొంత వ్యతిరేక భావాన్ని నింపినట్టయింది. దాని ప్రభావం ఓటింగ్ పర్సంటేజ్ మీద కనిపించినట్టే భావిస్తున్నారు. గ్రాండ్ ఫినాలె సమీపిస్తోన్న కొద్దీ.. ఓటింగ్‌లో షణ్ముఖ్ వెనుకపడటంతో దీప్తి అలర్ట్ అయ్యారు. తన లవర్ కోసం క్యాంపెయిన్ చేస్తోన్నారు.

    దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ..

    దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ..

    తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. బిగ్‌బాస్ వ్యూవర్స్‌ను కన్విన్స్ చేసేలా ఉందా పోస్ట్. షణ్ముఖ్ జశ్వంత్ వ్యక్తిత్వం గురించి తుది నిర్ణయం తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లో అతని ప్రవర్తనను చూసి.. వ్యక్తితాన్ని అంచనా వేయొద్దని కోరారు. ఇది ఓ షో మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. షణ్ముఖ్ ఓ గొప్ప మానవతావాదిగా చెప్పుకొచ్చారు. తన ఇష్టప్రకారమే అతను బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడుతున్నాడని అన్నారు. మీకు నచ్చినట్టు కాకుండా.. వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి.. అని విజ్ఞప్తి చేశారు.

     నేను షన్నును సపోర్ట్ చేస్తున్నా..

    నేను షన్నును సపోర్ట్ చేస్తున్నా..

    తాను షన్నుకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నానని దీప్తి సునయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పష్టం చేశారు. మీ అందరి అభిమాన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి.. అని కోరారు. షన్నుకు తాను ఇప్పుడు మాత్రమే కాదు.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. అతని గేమ్ అతను ఆడుతున్నాడని, ఇందులో ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ లేదని తేల్చి చెప్పారు. దీన్ని తాను నమ్ముతున్నానని అన్నారు. షణ్ముఖ్ నుంచి ప్రత్యేకంగా ఏమీ ఆశించొద్దని స్పష్టం చేశారు. అతణ్ని సంతోషంగా చూడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. #voteforshannu అనే హ్యాష్ ట్యాగ్‌తో తన ఇన్‌స్టా స్టోరీని ముగించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+