ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్
ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి బల్క్ మేసెజ్‌లు రావని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టంచేశారు. ఒకవేళ అలాంటి ఎస్సెమ్మెస్ వస్తే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని సూచించారు. బీహార్‌కు చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి డేటా సేకరించి అక్రమాలకు పాల్పడిందని వివరించారు. బహుమతుల పేరుతో భారీగా నగదు వసూల్ చేసిందని తెలిపారు. నలుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఆఫర్ల పేరుతో వల..
ఏదైనా ఆఫర్ ఉందంటే చాలు జనాలు.. డబ్బులు పంపించేందుకు కూడా వెనకాడరు. వారి నాడీ పట్టుకొన్న ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. బీహర్ కబీర్‌పూర్‌కి చెందిన బిపిన్ కుమార్, సందీప్ బిశ్వాస్, మాణిక్‌చంద్ పాశ్వాన్, మరొకరి కలిసి ఈజీగా డబ్బుల సంపాదించడంపై దృష్టిసారించారు. ఇటీవల ఆన్‌లైన్‌లో జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని.. కొన్ని కంపెనీల నుంచి డేటాను సైతం సేకరించారు.

ఇల్లును ఆఫీసుగా మార్చి..
నౌవడ జిల్లాలో ఓ ఇల్లు తీసుకొని.. నాలుగు కంప్యూటర్ల పెట్టి ఆఫీసుల మార్చారని సీపీ సజ్జనార్ తెలిపారు. అమెజాన్, ప్లిప్‌కార్ట్, క్లబ్ ఫ్యాక్టరీ, స్నాప్‌డీల్ నుంచి వినియోగదారుల డేటాను సేకరించారు. ఇంకేముంది వినియోగదారులకు గిప్ట్ పేరుతో వలవేస్తున్నారు. అలా కొందరు విశ్వసించి ముఠా అడిగిన డబ్బులు అకౌంట్‌లో వేయడం ప్రారంభించారు. ఇలా వారి దోపిడీ కొనసాగుతోంది.

తీగలాగితే..
ఇలా ఉంటే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ-కామర్స్ సైట్ల పేరుతో మోసపోయామని చెప్పడంతో.. పోలీసు కమిషనర్ సజ్జనార్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ పంపించి విచారణ చేపట్టగా ముఠా లీలలు బయటకొచ్చాయి. బహుమతులు వచ్చాయని పెద్ద మొత్తంలో నగదు వసూల్ చేసినట్టు తెలిసింది.

స్కార్పియో కారు కూడా
బిపిన్ కుమార్ బృందం నుంచి 12 మొబైల్స్, 2 ల్యాప్‌ట్యాప్‌లు, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. స్కానర్లు, నకిలీ ఆధార్, పాన్ కార్డులు, కొన్ని డేబిట్ కార్డులు కూడా లభించాయని చెప్పారు. ఏ కంపెనీ కూడా బల్క్ మేసెజ్ ఇవ్వదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ-కామర్స్ పేరుతో వచ్చే ఫోన్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications