BIO liquor: మద్యం ప్రియులకు తీపి కబురు, సిటీ మార్కెట్లోకి బయో లిక్కర్
హైదరాబాద్: మద్యం ప్రియులకు ఇది ఒక తీపికబురే. ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయనటువంటి బయో లిక్కర్(Bio Liqour) అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లోకి బయో లిక్కర్ని ప్రవేశపెడుతున్నట్టు బయో లిక్కర్స్ అండ్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బయో లిక్కర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్, పలు బయో లిక్కర్ ఉత్పత్తులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస అమర్నాథ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి బయో లిక్కర్ అని చెప్పారు. తులసీ, అల్లం, పసుపు, లవంగ, యాలుకలు, కలబంద వంటి ఆయుర్వేద పదార్థాలను కలిపి ఈ లిక్కర్ని తయారు చేస్తున్నట్లు శ్రీనివాస అమర్నాథ్ తెలిపారు. దీనికి యూఎస్ఎఫ్డీఏ(US FDA) అనుమతి కూడా లభించినట్లు వెల్లడించారు. బయో విస్కీ, బయో బ్రాందీ, వైల్డ్ పాక్స్ విస్కీని తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు తెలిపారు.

అంతేగాక, ఈ ఉత్పత్తుల్లో ఎటువంటి సింథటిక్ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్స్, హై క్వాలిటీ స్పిరిట్, మాల్ట్, బయో ఆల్కలాయిడ్స్తో వీటిని రూపొందించినట్లు తెలిపారు. మద్యపానం చేసే వారి అవయవాలపై చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతో వీటిని తయారు చేసినట్లు స్పష్టం చేశారు. అందరికీ ఆరోగ్య కరమైన జీవితం ప్రసాదించేందుకు ఈ ప్రయోగం చేశారమని నిర్వాహకులు చెప్పారు. అయితే, వీటి ధరలు తెలియాల్సి ఉంది.
-
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications