జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్దిగా కాంగ్రెస్ నేత..!?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ తమ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆ రెండు పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. బీజేపీ అభ్యర్ధి ఎంపికపై నియమించిన కమిటీ ముగ్గురు పేర్లతో నివేదిక సమర్పించింది. కాగా, అనూహ్యంగా కాంగ్రెస్ నేతను బీజేపీ తమ అభ్యర్దిగా బరిలోకి దించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రతిపాదన బైపోల్ వేళ సంచలనంగా మారుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు మరింత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టు స్టే ఇవ్వటం.. మారుతున్న సమీకరణాల వేళ రాజకీయంగా ఈ ఉప ఎన్నికలో గెలుపు ను సీరియస్ గా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేర్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా.. బీజేపీ అభ్యర్ధి ఎంపిక పైన కసరత్తు చేస్తున్నారు. ఈ అభ్యర్ధి ఎంపిక కోసం బీజేపీ నియమించిన కమిటీ ముగ్గురు పేర్లతో పార్టీకి నివేదిక ఇచ్చింది. కాగా, తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలి నుంచి బీజేపీ సీటు కోసం రేసులో లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి పేర్లు ఉన్నాయి. కాగా, తాజాగా సినీ నటి మాధవీ లత తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక - సామాజిక సమీకరణాల ఆధారంగా తమ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఊహించని విధంగా కొత్త పేరు తెర మీదకు వచ్చింది.

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించారు. ఏబీవీపీ లో పని చేసిన బొంతును బీజేపీలోకి చేర్చుకొని సీటు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ కొద్ది రోజుల క్రితం వరకు జూబ్లీహిల్స్ సీటు కోసం ప్రయత్నించారు. అయితే, నవీన్ యాదవ్ పేరు ప్రకటనకు ముందే తాను రేసులో లేనని వెల్లడించారు. ఇప్పుడు బీజేపీలో ఆయన పేరు తెర మీదకు వచ్చింది. కాగా, బొంతు రామ్మోహన్ మాత్రం తాను సీటు బీజేపీ నేతలను ఎవరినీ కలవలేదని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో టీడీపీ, ఎంఐఎం పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. బీజేపీ కోరితే సహకరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ కు ఎంఐఎం నిర్ణయం మేలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ తమ అభ్యర్దిగా ఎవరిని ఖరారు చేస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications