ఏపీ, తెలంగాణను కలిపే ఆలోచన కేసీఆర్ దే ? .. అధికారం కోసం దొరగారిది రోజుకో వేషం : డీకే అరుణ
అధికారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని కేసీఆర్, కేటీఆర్‌లకు అర్థమైందన్నారు. అందుకే మరలా ఎదో రకంగా అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తండ్రి , కొడుకులు రోజుకో కొత్త వేషం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

ఆంధ్ర, తెలంగాణ పేరుతో రెచ్చగొట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆంధ్ర, తెలంగాణ పేరుతో కల్వకుంట్ల కుటుంబం ప్రజలను రెచ్చగొట్టారని డీకే అరుణ విమర్శించారు. అమాయక యువకుల చావులకు కేసీఆర్ కారకుడయ్యారని ధ్వజమెత్తారు . ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అమరుల కుటుంబాలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ కొత్త రాగం ఎత్తుకొని.. మరోసారి ప్రజలను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

దమ్ముంటే చర్చకు రండి..
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు టీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని డీకే అరుణ ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరినా.. ఒక్క టీఆర్ఎస్ నేత కూడా ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో తెలంగాణను కలిపేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బహుశా ఆ ఆలోచన కేసీఆర్‌కి ఉందేమో అని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతు ఇవ్వబట్టే తెలంగాణ వచ్చిందన్న సంగతి గుర్తించుకోవాలని టీఆర్ఎస్ నేతలకు చురకలు అంటించారు.

ఆంధ్రాలో తెలంగాణను కలిపే ఆలోచన కేసీఆర్ దే?
తెలంగాణ పట్ల టీఆర్ఎస్ నేతల తీరు పలు అనుమానాలకు తావిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ మరలా అధికారంలోకి వస్తే తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీఎం కేసీఆర్‌కు ఆ ఆలోచన ఉండి కాబట్టే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో మాట్లాడిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications