మళ్ళీ బీజేపీకి చేరికల ఆశ: హస్తినకు బండి సంజయ్, ఈటల రాజేందర్

గత కొంతకాలంగా తెలంగాణ బిజెపిలోకి భారీగా చేరికలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇక తాజాగా మరో మారు బిజెపి చేరికలపై గంపెడు ఆశ పెట్టుకుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేయడంతో, మళ్లీ బిజెపి చేరికలపై ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హై కమాండ్ పిలుపుమేరకు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన అధినాయకత్వానికి నివేదికను ఇవ్వనున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల చేరికపై ఢిల్లీ పెద్దలతో బండి సంజయ్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.

 eatalabandi

ఇప్పటికే హుజరాబాద్ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకోగా, బండి సంజయ్ కూడా ఢిల్లీలో అధినాయకత్వంతో మాట్లాడి చేరికలకు రంగం సిద్ధం చేయనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ కు గురైన జూపల్లి కృష్ణారావును, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బిజెపిలోకి తీసుకురావడానికి బిజెపి సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జూపల్లి కృష్ణారావును, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి రావాలని ఆహ్వానించారు. ఇక మరోవైపు ఈటల రాజేందర్ కూడా చేరికలపై తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

జూపల్లి కృష్ణారావును, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలో చేర్చుకుంటే పార్టీకి లబ్ది జరుగుతుందని బిజెపి భావిస్తుంది. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో కూడా చర్చించి వారిని కూడా పార్టీలోకి తీసుకురావాలని బిజెపి భావిస్తుంది. ఈ క్రమంలోనే అధినాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో బిజెపి చేరికలకు వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే అనేకమార్లు బీజేపీలోకి చేరికల ప్రళయం రానుందని చెప్పిన బీజేపీ నేతలు చేరికల విషయంలో అభాసు పాలయ్యారు.

 eatalabandi

మరి బిజెపి ప్రయత్నంలో ఈసారైనా బీజేపీ సక్సెస్ అవుతుందా? చేరికలపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఈసారైనా నెరవేరుతాయా? అన్నది పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరుగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు బిజెపిలోకి కీలక నాయకులను తీసుకురాగలిగితే బిజెపి సక్సెస్ అయినట్టేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+