హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
హైదరాబాద్: బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో హైదరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు.
మరోవైపు, ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అంతేగాక, ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తున్నారు. అయితే, ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తుండటంతో మాధవీలత దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, మాధవీలత కూడా ఆయనకు ఏమాత్రం తగ్గకుండా హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రచారంలో జోరును పెంచారు.
కాగా, తాజాగా నామినేషన్ సందర్భంగా మాధవీలత తన అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరుగా ఉండటం గమనార్హం. మాధవీలత తన అఫిడవిట్‌లో రూ. 221 కోట్ల ఆస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతోతెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు.

మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్, ముగ్గురు పిల్లలకు సంబంధించి రూ. 165.46 కోట్లు ఆస్తులున్నాయి. కొంపెల్ల దంపతులకు 55.91 స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె ప్రకటించారు. మొత్తంగా రూ. 221.37 కోట్లు ఉన్నట్లు మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం తన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఫిడవిట్ లో కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. కాగా, ఆమెకు రూ. 90 లక్షల అప్పు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, గత వారం బేగంబజార్‌లో ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. సిద్దిఅంబర్ బాజర్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వద్ద ఊహాజనిత బానం గీసి వదిలినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications