విచారణ లేకుండానే చర్యలు ఎవరి కోసం?: జగిత్యాల్ ఎస్ఐ సస్పెన్షన్‌పై బండి సంజయ్ ఆగ్రహం
కరీంనగర్: జగిత్యాల ఎస్ఐ అనిల్ సస్పెండ్ అంశం స్థానికంగా దుమారం రేపుతోంది. ఎస్ఐ అనిల్‌కు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ శనివారం జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చాయి. వెంటనే ఎస్ఐ అనిల్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ఎస్ఐ విషయంలో ఎలాంటి విచారణ జరగకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని, ఇది కక్షసాధింపు చర్య అని మండిపడ్డాయి. కాగా, తాజాగా, అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పదించారు.
జగిత్యాల ఎస్ఐ అనిల్‌ను సస్పెండ్ చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్‌పై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అనిల్‌ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్సై దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఏ ఆధారాలతో ఎస్సైని సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. మానవత్వం లేకుండా ఎస్సైని సస్పెండ్ చేయడమే గాకుండా న్యూసెన్స్ కేసు పెట్టారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్‌పై దాడికి వచ్చిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఓ భర్తగా ఎస్సై తన భార్యను కాపాడుకోవడానికి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సైని సస్పెండ్ చేస్తే పోలీస్ సంఘాలు ఎక్కడికి వెళ్లాయని బండి సంజయ్ నిలదీశారు.
ఎలాంటి విచారణ లేకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల కొంత మంది సంఘవిద్రోహ శక్తులకు అడ్డగా మారిందన్నారు బండి సంజయ్.
తన భర్త ఏ తప్పూ చేయలేదంటూ ఎస్ఐ భార్య ఆవేదన
తన భర్త దాడి చేశాడంటూ మైనార్టీ యువతి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఎస్ఐ అనిల్ భార్య సంధ్య చెప్పారు. ఆమెపై తన భర్త చేయి చేసుకోలేదన్నారు. 'నా బిడ్డకు పాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో సీటు ఇవ్వాలని నేను యువతిని కోరాను. కండక్టర్ కూడా సీటు ఇవ్వాలని చెప్పారు. కానీ, ఆ యువతి ఆగ్రహంతో ఊగిపోయింది. నీ అంతు చూస్తానని.. మా వాళ్లకు ఫోన్ చేశానంటూ బెదిరించింది. బస్టాండ్‌లో మా వాళ్లు వెయిట్ చేస్తున్నారని.. నీ పని, నీ కొడుకు సంగతి చూస్తారంటూ హెచ్చరించింది. వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా నేను అసలు మాట్లాడలేదు. కండక్టర్ మరో బస్సు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనడం వల్ల నేను ఆ బస్సులో ప్రయాణించాను. మరో బస్సులో వచ్చి ఉంటే ఈ గొడవ కూడా జరిగేది కాదు. మార్గం మధ్యలో జగిత్యాల బస్ స్టేషన్‌కు రావాలని ఆమె ఫోన్లు చేయడంతో నాకు భయం వేసింది. దీంతో నా భర్త అనిల్‌కు ఈ విషయం చెప్పాను' అని సంధ్య మీడియా ముందు వాపోయారు.
'యువతి దూషణలు తట్టుకోలేక ఏడుస్తూ నా భర్తకు ఫోన్ చేశా. బస్‌స్టేషన్ వరకు నేను రానని, బస్ డిపో వద్ద దిగుతానని చెప్పాను. దీంతో నన్ను రిసీవ్ చేసుకునేందుకు నా భర్త వచ్చారు. వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో యువతి వీడియో తీస్తుంటే నా భర్త అడ్డుకుని ఫోన్ లాక్కొవడంతో సెల్ కిందపడిపోయింది. ఫోన్ లాక్కుంటున్న క్రమంలో ఆమెకు, నాకు మధ్య జరిగిన పెనుగులాటలో నా చేతి గాజులు పగిలిపోయాయి. ఈ ఘటనలో నా చేతికి గాయం కూడా అయింది. నా భర్త యువతిని బూట్లతో కొట్టలేదు. మఫ్టీలో ఉన్న వ్యక్తి స్లిప్పర్లు వేసుకుని వస్తే.. బూట్లతో తన్నాడని యువతి చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు' అని ఎస్ఐ భార్య సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications