Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ తరపున నవనీత్ కౌర్ ఎన్నికల ప్రచారం: ఏమన్నారంటే?

తెలంగాణలో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరు కొనసాగిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ.. ఈసారి మాత్రం డబుల్ డిజిట్ సీట్లు స్థానాలు సాధించేందుకు రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల నేతుల కూడా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాజాగా, టాలీవుడ్ ప్రేక్షకులకు సినీ హీరోయిన్‌గా తెలిసిన నవన్ నీత్ కౌర్ (నవనీత్ రవి రాణా) బీజేపీ తరపున తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నవనీత్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మహారాష్ట్రలో పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా నవనీత్ ప్రచారం నిర్వహించారు. బీబీ పాటిల్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

BJP leader Navneet ravi rana election campaign held in zaheerabad telangana

గత ఐదేళ్లలో బీబీ పాటిల్ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశరాన్నారు నవనీత్. ఈసారి బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ 400 స్థానాల్లో జహీరాబాద్ కూడా ఒకటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే పాకిస్థాన్‌కి ఓటేయడమేనని అన్నారు. లాలూ ప్రసద్ యాదవ్ లాంటి వారు మాత్రమే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అంటున్నారని విమర్శించారు.

BJP leader Navneet ravi rana election campaign held in zaheerabad telangana

గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని నవనీత్ కౌర్ అన్నారు. ఎస్టీ, ఎస్టీలను గౌరవించేవారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోడీనేనని ఆమె చెప్పారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో మొత్తం 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+