కవిత కొత్తపార్టీ అప్పుడే..పాదయాత్రకు ప్లాన్!
తెలంగాణలో కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత పోరు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికి కారణంగా మారింది. కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వస్తుందని, కొత్త పార్టీ పెడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఈ క్రమంలో తాజాగా కవిత లేఖ పైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత కొత్త పార్టీ అప్పుడే
కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. కవిత కొత్త పార్టీతో తనకు తానుగా ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తుందని, కవిత త్వరలోనే పార్టీ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జూన్ రెండవ తేదీన ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ ను విభేదించి పార్టీ నుంచి వైదొలగి కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాదయాత్రకు కవిత ప్లాన్
వైయస్ షర్మిల బాటలోనే కవిత కూడా అన్నతో విభేదించి కొత్త పార్టీ పెట్టి, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని బిజెపి ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. వైయస్ షర్మిల తరహాలో కవిత కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ను ఇబ్బందుల పాలు చేయనున్న కవిత
పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే తండ్రి, కూతుళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి కానీ దానికి మధ్యవర్తులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. గెలిచినప్పుడు కేసీఆర్ అందరికీ దేవుడయ్యాడు కానీ ఒక్క ఓటమి ఎదురుగానే ఇప్పుడు దెయ్యాల పైన చర్చ జరుగుతుందంటూ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పాలు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుంటుందని బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణా జాగృతి నేతలతో కవిత కీలక సమావేశం
ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం నిర్వహించారు బంజారాహిల్స్ లోని తన నివాసంలో వారితో భేటీ అయ్యారు. జాగృతి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో తాజా పరిణామాలు, జాగృతి తరఫున చేపట్టబోయే కార్యక్రమాల పైన చర్చిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications