బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేళ జైల్లో రిమాండ్ ఖైదీ 7917గా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఊహించని విధంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరు పరిచి జైలుకు తరలించారు పోలీసులు. దీంతో బిజెపికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు, పార్టీ రథసారథి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.

నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై బిజెపి కీలక నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? ముందు ముందు ఎలాంటి కార్యాచరణకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు? అన్నది ఆసక్తికర అంశంగా మారింది.

Bandi Sanjay In Jail On BJP Foundation Day

నేడు దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా ఉన్న బిజెపి 1980 ఏప్రిల్ 6వ తేదీన ఏర్పాటయింది. నాడు భారతీయ జనతా పార్టీని అటల్ బీహార్ వాజ్పేయి , లాల్ కిషన్ అద్వానీలచే ఏర్పాటు చేశారు. నాటినుండి నేటి వరకు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది.

ఇక వచ్చే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని, కాషాయ జెండాని ఎగరవేయాలని ప్రయత్నం చేస్తుంది.

ఇక కేంద్రంలో బిజెపితో తలపడుతున్న బి ఆర్ ఎస్ బిజెపిని అడుగడుగున ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ప్రస్తుతం బండి సంజయ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా కారాగారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు రిమాండ్ ఖైదీ నెంబర్ 7917 ను కేటాయించారు.

ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ బ్యారక్ ను కేటాయించారు. బండి సంజయ్ ను కలవడానికి కరీంనగర్ జిల్లా కారాగారం వద్ద ఆయన సతీమణి అపర్ణతో పాటు కుమారులు భగీరథ్, సుముఖ్ లు నిరీక్షించినప్పటికీ బండి సంజయ్ వాహనాన్ని నేరుగా జైల్లోకి తీసుకువెళ్లడంతో బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆయనను కలవలేకపోయారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించి, పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపి, భవిష్యత్తు ఎన్నికలకు దిశా నిర్దేశం చేయవలసిన తెలంగాణ పార్టీ రథసారథి బండి సంజయ్ జైలు పాలు కావడంతో తెలంగాణ బిజెపి ఆత్మరక్షణలో పడింది. ఇక ఈ ఆత్మరక్షణ భావన నుండి బయటపడి ఆత్మవిశ్వాసంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికలకు వెళ్తుందా? లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+