అక్రమ చిట్ ఫండ్ లకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ టెక్నాలజీ ..ఇక మోసపూరిత చిట్ ఫండ్ లకు చుక్కలే
రాష్ట్రంలో చిట్ ఫండ్ మోసాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్ ఫండ్ కంపెనీలు చిట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయి. చిట్ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పలు చిట్ ఫండ్ కంపెనీలు చీటీ పాడిన తరువాత కూడా సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా , నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే అక్రమ చిట్ ఫండ్ కంపెనీ లకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం బ్లాక్ చైన్ టెక్నాలజీ ని అమల్లోకి తెచ్చింది.

14 అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో .. చిట్ ఫండ్ మోసాలకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ టెక్నాలజీ ...
రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల చిట్ ఫండ్ కంపెనీలు ఉండగా అవి ఏటా 20 వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని చేస్తున్నాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా చాలా కంపెనీలు చిట్ ఫండ్ యాక్ట్ ను అనుసరించకుండా నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఇక అలాంటి వారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు లోకి తీసుకు వచ్చిన బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగారెడ్డి ,హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు దీనిని రాష్ట్రవ్యాప్తంగా 14 అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీ చిట్ యాప్ ను జూన్ నాటికి అందుబాటులోకి... ఎప్పటికప్పుడు ట్రాక్ రికార్డ్ మానిటరింగ్ అవకాశం
ఇక ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలుకు సంబంధించి టీ చిట్ యాప్ ను జూన్ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
ఈ యాప్ వల్ల చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతా ఎప్పటికప్పుడు మానిటర్ చేయబడుతుంది. చిట్ ఫండ్ కంపెనీలు ఎంత ప్రైజ్ బిడ్ పాడుతున్నాయి. సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూడడానికి వీలవుతుంది. ఈ టెక్నాలజీలో వివరాలను టాంపరింగ్ చేయడానికి ఏ విధమైన అవకాశమూ ఉండదు.

బ్లాక్ చైన్ టెక్నాలజీతో అక్రమ చిట్ ఫండ్ లకు చుక్కలే
అంతేకాకుండా ఈ ఆన్లైన్ టెక్నాలజీ వల్ల రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలు తమ చిట్ విలువ మొత్తాన్ని డబ్బు రూపంలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ డిపాజిట్లు సైతం ఆన్లైన్లో మానిటర్ చేయడానికి వీలవుతుంది. ఈ విధానం అన్నీ చిట్ ఫండ్ రిజిస్ట్రార్ల శాఖలో అమల్లోకి తీసుకువస్తే ఇక అక్రమ చిట్ ఫండ్ కంపెనీలకు చెక్ పెట్టడానికి వీలవుతుంది. ఇంతకాలం సభ్యులకు చుక్కలు చూపిస్తున్న చిట్ ఫండ్ కంపెనీలకు చుక్కలు చూపించడానికి వీలవుతుంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications