పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాల్ దర్వాజ క్రాస్ రోడ్ పక్కన ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. షోరూరంలో గ్యాస్ సిలిండర్స్ పేలుతున్నట్లు శబ్దం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. అగ్నిప్రమాదంతో చార్మినార్ వైపు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

పాతబస్తీ శాలిబండలోని లాల్ దర్వాజ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ప్రమాదవశాత్తూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 8 ఫైర్ ఇంజిన్ లతో ఘటనాస్థలికి చేరుకుంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు అంతస్తుల్లో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఉన్నట్లు సమాచారం. షోరూమ్ లో సిలిండర్లు పేలిన శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

Blaze in Old City Massive Fire Guts Shalibanda Electronics Showroom Firefighters Battle On

మరోవైపు మంటలు భారీగా ఎగిసిపడుతూ పక్క షాపులు, ఇళ్లకు అంటుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు అగ్నిప్రమాదం నేపథ్యంలో చార్మినార్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముందు జాగ్రత్తకోసం చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+