బ్లడ్ ఆర్ట్: మంత్రి ఎర్రబెల్లికి పుట్టినరోజు గిఫ్ట్; వీరాభిమానం!!
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . మాస్ లీడర్. ఏ పని చేసిన ఆయన రూటే సపరేటు. అన్ని వర్గాలను కలుపుకుని పోవడంలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలలో తన పనితీరుతో దూసుకుపోతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అభివృద్ధి పైన కూడా అంతే శ్రద్ధ పెట్టి జిల్లా వాసుల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మాస్ లీడర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బర్త్ డే.. రక్తంతో ఆర్ట్..!!#ErrabelliDayakarRao #BRSMLA #TelanganaNews #TSPolitics #HBDErrabelliDayakarRao #Oneindiatelugu pic.twitter.com/obbS43QOsl
— oneindiatelugu (@oneindiatelugu) July 4, 2023
ఇక ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు, అనుచరులు ఆయన పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజున తమ ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులు మంత్రి ఎర్రబెల్లికి చాలామంది ఉన్నారు.

ఇక తాజాగా తన రాజకీయ గురువు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం రోజున తన రక్తంతో ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రాన్ని ఆర్ట్ గా వేయించి, ఫోటో ఫ్రేమ్ చేయించి, దానిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బహుమతిగా ఇచ్చారు కే.యూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు డా.మేడారపు సుధాకర్ .
మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు తనకు పండుగ రోజు అని అందుకే ఇలా చేశానని చెప్పి అభిమానం చాటుకున్నాడు. ఆ ఆర్ట్ ఫ్రేమ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు బహూకరించగా ఆ ఫోటో ఫ్రేమ్ ను చూసిన ఎర్రబెల్లి తన జన్మదినం సందర్భంగా మరచిపోలేని ఫ్రేమ్ ను ఇచ్చిన తన అభిమాని డా.మేడారపు సుధాకర్ ను ఆత్మీయతతో ఆలింగనం చేసుకొని అభినందించారు.

ఇది తన పుట్టినరోజున అపురూపమైన కానుక అని ధన్యవాదాలు తెలిపారు. బ్లడ్ ఆర్ట్ వేయించిన వ్యక్తికి దయాకర్ రావుపై ఉన్న వీరాభిమానం ఇప్పుడు చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ముందస్తుగా పెళ్లి దయాకర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉండాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications