Bogatha Video: పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న తెలంగాణా నయాగరా.. బొగత జలపాతం!!
తెలంగాణ నయాగరాగా గుర్తింపు పొందిన బొగత జలపాతం జలకళతో తొణికిసలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బొగత పరవళ్ళు తొక్కుతోంది. బొగత జలపాతం అందాలను, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిండు కుండలా మారి కొత్త అందాలతో, జల సవ్వడితో పర్యాటకుల మనసులకు ఆహ్లాదాన్ని అందిస్తున్న బొగత జలపాతం అందాలు ప్రతి ఒక్కరిని బొగత జలపాతం వద్దకు వెళ్ళేలా చేస్తున్నాయి.
బొగత అందాలు ఉరుకుల పరుగుల జీవితంలో అలసిన మనసును రిలాక్స్ చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ములుగు జిల్లా పర్యాటకులకు రారమ్మని స్వాగతం పలుకుతుంది. ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సు, సమ్మక్క సారలమ్మలు ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు టూరిస్ట్ లకు ఆతిధ్యం ఇస్తున్నాయి. ఈ సీజన్లో బొగత పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ప్రతి ఒక్కరు బొగత అందాలను చూడడానికే ఇక్కడికి వస్తూ ఉంటారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద బొగత జలపాతం, నయాగరా ఫాల్స్ లా కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉదృతి విపరీతంగా పెరగడంతో బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతుంది.
దీంతో మహోగ్రరూపం దాలుస్తున్న బొగత జలపాతం వద్దకు సందర్శకులకు అనుమతించట్లేదు. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో సందర్శకులను జలపాతంలోకి దిగడానికి అనుమతించడం లేదు. ప్రస్తుతం బొగత జలపాతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది.
Bogatha Video: పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న తెలంగాణా నయాగరా.. బొగత జలపాతం!!#Waterfalls #BogathaWaterfalls #Godavari #Telangana #Oneindiatelugu pic.twitter.com/od8FRpJZRT
— oneindiatelugu (@oneindiatelugu) July 13, 2023
ఈ జలపాతాన్ని చూడటం కోసం వచ్చే పర్యాటకులు జలపాతంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండటం కోసం అటవీ శాఖాధికారులు జలపాతం చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇక పర్యాటకులు జలపాతం దగ్గర ఎంజాయ్ చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు, అందులో పర్యాటకులు సరదాగా గడిపేలా ఏర్పాట్లు చేశారు. గతంలో కొందరు పర్యాటకులు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మరణించిన విషాద ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications