సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు, తనిఖీ(పిక్చర్స్)
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సరూర్‌నగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన సాయిబాబా గుడికి పరుగెత్తుకు వచ్చి తనిఖీలు నిర్వహించారు.
భక్తులను బయటికి పంపించి, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు. ఈ హఠాత్పరిణామానికి స్థానిక ప్రజలు, భక్తులు, ఆలయ అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ వచ్చినట్లు తెలిసింది. 'బాంబు పెట్టాము మరికాసేపట్లో పెలుతుంది' అని ఆ ఫోన్ కాల్‌లో దుండగులు.. పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఆకతాయి వ్యక్తి 7863656157 నెంబర్ నుంచి 100కు ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు తెలిపాడు.
తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎటువంటి బాంబు దొరకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. తరచూ ఆకతాయిలు, పోలీసుల్ని ఆటపట్టించడానికి ఇటువంటి కాల్స్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయితే ఇంతకుముందు పలుమార్లు ఈ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరగడం లేదా ఇక్కడ బాంబులను గుర్తించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
2002 సంవత్సరంలో తొలిసారిగా ఆలయం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. 2007 సంవత్సరంలో బాంబు అమర్చారు గానీ, అది పేలకముందే ఓ పోలీసు కానిస్టేబుల్ దాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. కాగా, దుండగులు ఎక్కడ్నుంచి ఫోన్ చేశారనే అంశంపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బాంబు స్క్వాడ్ తనిఖీ
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది.

ఆలయం వద్ద తనిఖీలు
సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సరూర్‌నగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.

ఆలయంలో తనిఖీలు
దీంతో పోలీసులు హుటాహుటిన సాయిబాబా గుడికి పరుగెత్తుకు వచ్చి తనిఖీలు చేశారు.

ఆలయంలో తనిఖీలు
భక్తులను బయటికి పంపించి, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు, భక్తులు, ఆలయ అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఆలయం ఎదుట తనిఖీలు
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ వచ్చినట్లు తెలిసింది. 'బాంబు పెట్టాము మరికాసేపట్లో పెలుతుంది' అని ఆ ఫోన్ కాల్‌లో దుండగులు.. పోలీసులకు చెప్పారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications