సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త, టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్ - బిగ్ డెసిషన్..!!

సంక్రాంతి ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. ప్రతీ ఏటా సంక్రాంతి సమయంలో రెండు రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రయాణాలు జరుగుతాయి. టోల్ గేట్ల వద్ద వేల సంఖ్యలో రాకపోకలు చోటు చేసుకుంటాయి. దీంతో.. టోల్ గేట్ల వద్ద రద్దీ ఏర్పడి.. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో, ఈ సారి ముందుగానే అధికారులు అలర్ట్ అయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫాస్టాగ్ యూజర్లు ఈ సారి టోల్ గేట్ల వద్ద బ్రేకులు వేయకుండానే.. దూసుకెళ్లే విధంగా అవకాశం కల్పించారు.

సంక్రాంతి సమయంలో హైదరాబాద్ - విజయవాడ మధ్య వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ప్రతీ ఏటా టోల్ గేట్ల వద్ద భారీ వాహనాల రద్దీ.. నిరీక్షణ ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది. దీంతో.. ఈ సారి అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తం అయింది. కీలక నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బూస్టర్ లైన్ల విధానం అమలు చేయాలని డిసైడ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా ఏర్పడనుంది. దీనిని నివారించేందుకు టోల్‌ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం శంషాబాద్, బొంగలూరు, పెద్ద అంబర్‌పేట టోల్‌ప్లాజాల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.

booster-lines-to-provide-at-toll-gates-for-passage-of-fastag-users-details-here

ఈ బూస్టర్ బారియర్ల వద్ద ఫాస్టాగ్ వాహనాలు ఇక టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే నేరుగా వెళ్లిపోయేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇందుకోసం టోల్‌గేట్ల వద్ద రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వాహనాలు ఆగకుండా త్వరగా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 12 నుంచి 15 టోల్ బూత్‌లు ఉండగా.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సరిపోవడం లేదు. దీంతో ఈ బూస్టర్ బారియర్స్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

అదే విధంగా.. సంక్రాంతి సమయంలో వాహనదారుల దగ్గర టోల్‌ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని కోరారు. దీంతో కేంద్రం కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+