భూమా అఖిలప్రియ నో బెయిల్: ఆ ఒక్క అవకాశానికి కోర్టు ఓకే: సెషన్స్ కోర్టుకు వెళ్లేలా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియకు మళ్లీ చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సికింద్రాబాద్ న్యాయస్థానం నిరాకరించింది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీనితో ఆమె తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ ఉదంతంలో భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ..తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటీషన్‌పై శనివారం విచారణ చేపట్టిన సికింద్రాబాద్ న్యాయస్థానం సోమవారం నాటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

తాజాగా- ఈ ఉదయం అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఆమె తరఫు న్యాయవాదితో పాటు కౌంటర్ పిటీషన్‌ను దాఖలు చేసిన పోలీసుల వాదనలను న్యాయస్థానం ఆలకించింది. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ అడ్వొకేట్ అభ్యర్థించారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం వల్ల బెయిల్ ఇస్తే.. సాక్ష్యాధారాలను ప్రభావితం చేయగలరని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.
ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ అజ్ఙాతంలోనే ఉన్నారని, ఆయన గురించి ఆరా తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్తగా మరో 15 మందిని అరెస్ట్ చేసినందున.. కేసు తీవ్రత మరింత పెరిగినట్టయిందని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వడం సరికాదని అన్నారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సికింద్రాబాద్ కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications