బీఆర్ఎస్ ధర్నాలో నవ్వులు పూయించిన తొండ!

రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, రైతుల రుణమాఫీ కూడా చాలా మంది రైతులకు ఇంకా జరగలేదని బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ రైతు రుణం ధర్నా నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో రైతు రుణం ధర్నా నిర్వహించారు.

రైతు రుణం ధర్నాలో విచిత్ర సంఘటన
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న సమయంలో వేదిక మీదికి ఒక తొండ వచ్చింది.

BRS dharna covered with laughter with oriental garden lizard this is what happened

రాజయ్య ధోతీలో తొండ
తొండను చూసి అక్కడే కూర్చున్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి పక్కకు జరిగారు. ఇక తాటికొండ రాజయ్య తొండకు భయపడతారా అంటూ వారిని చూసి నవ్వారు. ఆపై ఆయన మాట్లాడుతున్న క్రమంలో తొండ నిలుచుని మాట్లాడుతున్న రాజయ్య దోతి పైకెక్కి షర్టు లోపలికి చొరబడింది. లోపల తొండ అలికిడి అర్థమైన రాజయ్య ఓ చేత్తో మైక్ పట్టుకుని మరో చేత్తో తొండను షర్టుతో గట్టిగా పట్టుకున్నారు.

తొండను పట్టుకుని బయట పడేసిన బీఆర్ఎస్ శ్రేణులు
ఇక పక్కనే ఉన్న బిఆర్ఎస్ రాజయ్య చొక్కా విప్పి తొండను పట్టుకొని బయటపడేశారు. ఇక రాజయ్య మాట్లాడుతున్న సమయంలో తొండ చేసిన పనికి ఇది కూడా ప్రభుత్వ కుట్రే అంటూ తాటికొండ రాజయ్య కాసేపు ఆ సభలోని వారితో చమత్కరించారు. దీంతో కాసేపు అక్కడ నవ్వుల పువ్వులు పూశాయి.

తొండలపై రాజయ్య వ్యాఖ్యలు.. ఆపై రాజయ్య దోతీపైకి తొండ
తాడికొండ రాజయ్య తొండలు మనల్ని ఏం చేస్తాయి అంటూ ప్రసంగిస్తున్న సమయంలోనే తొండ తాటికొండ రాజు ఏ మాటలను అర్థం చేసుకొని ఆయన ధోతీలోకి దూరి హంగామా చేసింది. తనకి ఈ ఆసక్తికర సంఘటన ఈరోజు బిఆర్ఎస్ పార్టీ రైతు రుణం ధర్నాలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ ధర్నాలో తొండ కథ నే చెప్పుకుంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+