పవన్ పై రూటు మార్చిన బీఆర్ఎస్ ? కాంగ్రెస్ మంత్రుల వార్నింగ్స్ తో..! ఫ్యాన్స్ ఆగుతారా ?
ఏపీలో కోనసీమ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లే ఇక్కడి కొబ్బరిచెట్లు వాలిపోయాయంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్దూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మొదట్లో పవన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన విపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ అటాక్ నేపథ్యంలో రూటు మార్చేసింది.
పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై నిన్న కాంగ్రెస్ మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఒక్క థియేటర్లోనూ ఆాడవంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. పవన్ వెనక్కి తగ్గకపోయే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మరో మంత్రి వాకిటి శ్రీహరి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా హెచ్చరికలు చేస్తున్నారు.

అయితే విపక్ష బీఆర్ఎస్ తొలుత పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై ఫైర్ అయింది. పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు మా దిష్టి వాళ్ళకి తాకడం కాదు, ఇన్నెండ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారన్నారు. కానీ తాజాగా కాంగ్రెస్ మంత్రుల అటాక్ తో ఆయన రూటుమార్చారు.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని కోరుతూనే ఆయన వ్యాఖ్యలు చేసిన 10 రోజులు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందించడం ఆశ్చర్యంగా ఉందని జగదీష్ రెడ్డి తెలిపారు. పవన్ సినిమాలు ఆడవని అంటున్నారని, మీరు చూడొద్దంటే వాళ్ల అభిమానులు ఆగుతారా? అని ప్రశ్నించారు. పది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మాటలపై ఇప్పుడు హడావుడి చేస్తున్నారన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి ఇన్ని రోజులు వాటర్‌లో నీళ్లు కలిపే పనిలో బిజీగా ఉన్నాడా?, మిగతా మంత్రులు కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పవన్ కు ఇస్తున్న వార్నింగ్ లు మాత్రం ఆగడం లేదు. ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు తాను ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకొని క్షమాపణలు చెప్పడం లేదని, కనీసం స్పందించడం కూడా లేదన్నారు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్ళు కచ్చితంగా దీనిపై స్పందిస్తారన్నారు. అయితే పవన్ పార్టీ జనసేన మాత్రం నిన్న రాత్రే ఆయన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications