BRS internal war: బీఆర్ఎస్ అభ్యర్థికి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ వార్నింగ్!!
తెలంగాణా రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా పార్టీ నేతల మధ్య వార్ రోడ్డున పడి పోరాటాల దాకా వెళ్తుంది. తాజాగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలకు అభ్యర్థిగా ప్రకటించిన జాన్సన్ నాయక్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తనపై కక్షపూరితంగా సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి పనులను ఆపివేయిస్తున్నారని ఎమ్మెల్యే రేఖ నాయక్ మండిపడ్డారు. కావాలని ఏ సి డి బి నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన నిధులను ఇవ్వకుంటే ఖానాపూర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ హెచ్చరికలు జారీ చేశారు.

2.25 కోట్ల రూపాయల నిధులను ఆపివేసి , తనను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. నిధులు విడుదల చేయకపోతే తాను కచ్చితంగా ఖానాపూర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతగానో పనిచేశానని, వచ్చే ఎన్నికలలో తాను రెబల్ గా నైనా, ఇండిపెండెంట్ గానైనా ఎన్నికల బరిలోకి దిగుతానని ఎమ్మెల్యే రేఖ నాయక్ పేర్కొన్నారు.
అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె అభిప్రాయం వెల్లడించారు. అభివృద్ధి తాను చేస్తే, మిగిలిన వారు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇది సరికాదని ఎమ్మెల్యే రేఖ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా అభివృద్ధి పనులను ఆపివేస్తారని నిప్పులు చెరిగారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే రేఖ నాయక్ పేర్కొన్నారు.
ఇక పోలీస్ అధికారుల పైన అసహనం వ్యక్తం చేసిన రేఖ నాయక్ తన దగ్గర ఉన్న ఎస్ బీ కానిస్టేబుల్స్ ను కూడా తీసివేశారు అని మండిపడ్డారు. ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు కావడానికి తాను ఎంతో కృషి చేశానని తెలిపారు. ప్రజలు తనను ఆదరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications