కవిత వ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న బీఆర్ఎస్
ప్రస్తుతం ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా భారత రాష్ట్ర సమితికి తిరిగి అవే చుట్టుకుంటున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ పార్టీకి చాలా కష్టకాలం నడుస్తోందని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా కలిసిరావడంలేదు. కొన్ని వివాదాలను ఆ పార్టీ తన నెత్తికి చుట్టుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక సీట్లో ఓడిపోవడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయంతోపాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కూడా బీఆర్ఎస్ కు గడ్డుకాలాన్ని తెచ్చిపెట్టింది. అయితే అంతేకంటే ఎక్కువ సమస్యలు కల్వకుంట్ల కవిత నుంచి ఎదురవుతున్నాయి.
కవిత పన్నని వ్యూహంలో ఆ పార్టీ నేతలు చిక్కుకొని విలవిలలాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలంతా కవితనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతూ ఆమెకు కావల్సినంత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. మాట్లాడే సమయంలో ఈ నేతలంతా వివాదాల్లో చిక్కుకునేలా మాట్లాడుతుండటంతో కేసీఆర్ కు, కేటీఆర్ కు తలనొప్పిలా మారింది. అవసరం లేని సమయంలో కూడా కవితపై రాజకీయాలు చేస్తూ, విమర్శలు చేస్తుండటంతో దీన్ని అవకాశంగా మలుచుకున్న కవిత తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. ఎందుకంటే నిరంజన్ రెడ్డి కవితను వంకాయతో పోల్చి ఆమెను అవమానపరిచారు. అంతేకాదు.. ఆయన పుచ్చ పగిలిపోతుందనే మాట కూడా వాడారు. జనం బాటలో ఉన్న కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను, హరీష్ రావుపై విరుచుకుపడుతున్నారు. తనను విమర్శిస్తున్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడిపై హరీష్ రావు వర్గంగా ముద్ర వేస్తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. ఆమె అంతిమ టార్గెట్ హరీష్ రావే అయినా, కవిత చేస్తున్న రాజకీయంతో రాజకీయంగా తాము ఎక్కడ సమాధి అవుతామో అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications