హరీష్ రావుకు బిగ్ షాక్.. సీఎం రేవంత్, మాజీ ఎంపీ కవిత ట్వీట్స్ !!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
కాగా సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త సత్యనారాయణ. హరీష్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన గ్రామంతో అనుబంధం కొనసాగించారు. ప్రతి సంవత్సరం ఉగాది, దసరా, సంక్రాంతి పండుగల సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి ప్రజలతో కలిసేవారు.

కోకాపేట్ నివాసంలో పార్థివదేహం..
సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్ కోకాపేట్‌లోని క్రిన్స్ విల్లాస్‌లోని ఆయన స్వగృహంలో ఉంచారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో లేదా హైదరాబాద్‌లోనే సాయంత్రం నిర్వహించే అవకాశముందని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
కేసీఆర్ సంతాపం..
మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తన బావ అయిన తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్యనారాయణ ఎంతో మృదుస్వభావి, కర్తవ్యనిష్ఠుడైన వ్యక్తి అని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అని ప్రార్థించారు.

కేటీఆర్, కవితల సంతాపం..
ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ఇద్దరూ సోషల్ మీడియా వేదికల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్‌లో "హరీశ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలి" అని రాశారు. అలానే కవిత తన పోస్ట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుభూతి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా హరీష్ రావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. తన్నీరు సత్యనారాయణ మృదుస్వభావి, గౌరవనీయ వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. హరీశ్‌రావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని తెలియజేశారు.
మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, కాంగ్రెస్, బీజేపీ, బీసీ సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు కూడా హరీశ్‌రావు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రసాద్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. కోకాపేట్ వద్ద రోడ్లపై పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేశారు.
మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యుడు శ్రీ తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) October 28, 2025
మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2025
సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.












Click it and Unblock the Notifications