కవిత అరెస్టు కేసులో ఊహించని మలుపు

K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేసు.. మరో మలుపు తిరిగింది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం నిరాకరించిన నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై నేడు విచారణ జరుగనుంది.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్ట నాయకులకు చెల్లించినట్లు ఆమెపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

BRS leader K Kavitha moves Delhi HC for bail in Delhi Liquor Policy Scam

బెయిల్ కోసం కవిత దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఈ నెల 6వ తేదీన రోస్ అవెన్యూ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పు ఇచ్చారు. ఫలితంగా- జ్యుడీషియల్ కస్టడీ ముగిసేంత వరకూ ఆమె సీబీఐ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో బెయిల్ కోసం కవిత.. తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను వేశారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాదులు మోహిత్ రావు, దీపక్ నగర్ ఈ పిటీషన్లను దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్.. విచారణ చేపట్టనుంది.

BRS leader K Kavitha moves Delhi HC for bail in Delhi Liquor Policy Scam

ఈ కేసులో మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 50 కింద అప్రూవర్‌ మారిన వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మాత్రమే ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఆ స్టేట్‌మెంట్లకు సంబంధించిన ఒక్క డాక్యుమెంట్‌ను కూడా ఇప్పటివరకు అధికారులు సేకరించలేకపోయారని కవిత తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ప్రకారం తనను అరెస్టు చేయడం అక్రమం అని, 100 కోట్ల రూపాయలను ఆప్ నేతలకు చెల్లించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలను కూడా సంపాదించలేకపోయారని, ఆ నగదును కూడా రికవర్ చేయలేకపోయారని అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఇదొక కారణంగా చూపించారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+