విరాట్ కోహ్లీకి ముఖ్య నేతల థాంక్స్..!!

విరాట్ కోహ్లీ. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అంతా చర్చించుకుంటున్న పేరు. టెస్టు ఫార్మాట్ కు విరాట్ గుడ్ బై చెప్పేసాడు. క్రికెట్ లో విరాట్ విలక్షణ ఆటగాడు. భారత్ లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ కోహ్లీని ఆరాధించే వారు ఉన్నారు. భార‌త జ‌ట్టు టెస్టు పోక‌డ‌నే మార్చేసిన ప్రత్యేక ప్లేయర్. కొత్త త‌ర‌హా టీమిండియాను త‌యారు చేయ‌డంలో స‌ఫ‌లం అయ్యాడు. టెస్టుల్లో తన మార్క్ బ్యాటింగ్ తో దుమ్మురేపిన కోహ్లీ ఇప్పుడు ఆ టెస్టులకే దూరమయ్యాడు. విరాట్ నిర్ణయం పైన రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు.

విరాట్ కోహ్ల క్రికెట్ ఫ్యాన్స్ ఆరాధించే పేరు. కోహ్లీ ఎంట్రీతో టెస్టు క్రికెట్‌లో ఇండియన్ గేమ్ స్ట‌యిల్ మారిపోయింది. ఇండియన్ గ్రౌండ్స్ లోనే కాదు.. విదేశీ పిచ్‌ల‌పై విరుచుకుప‌డే అరుదైన ఆటగాడు. దేన్నీ వ‌దిలేది లేద‌న్న స్ట‌యిల్‌లో అత‌ను గ్రౌండ్‌లో ఆడేవాడు. అభిమానులు రన్నింగ్ మిషన్ గా పిలుచుకొనే కోహ్లీ తాజా నిర్ణయం అభిమానులకే కాదు.. రాజకీయ నేతలకు రుచించటం లేదు. అయితే, విరాట్ టెస్టు క్రికెట్ కు చేసిన సేవలను మాత్రం వారు అభినందిస్తున్నారు. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోతాడంటూ ప్రశంసిస్తున్నారు. విరాట్ టెస్టుల్లో 9 వేల ర‌న్స్ చేశాడు. 30 సెంచ‌రీలు ఉన్నాయి. ఆ రికార్డుతో టెస్టుల‌కు గుడ్‌బై చెప్పాడు కోహ్లీ.

https://twitter.com/RaoKavitha/status/1921837492627783857

brs-leaders-kavitha-and-harish-reacts-on-virat-kohli-retirement

కింగ్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకటం పైన బీఆర్ఎస్ నేతలు కవిత, హరీష్ స్పందించారు. ఓ అసాధార‌ణ టెస్టు ప్ర‌యాణం ముగిసింద‌ని హరీష్ వ్యాఖ్యానించారు. భార‌తీయ క్రికెట్ ను కొత్త ద‌శ‌కు తీసుకెళ్లిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌న ఎక్స్ అకౌంట్‌లో హ‌రీశ్ రావు స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ దీక్ష‌ను, నాయ‌క‌త్వాన్ని ప్ర‌శంసించారు. టెస్టుల్లో ఎన్నో మ‌ధుర స్మృతుల‌ను అందించినం దుకు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు. వ‌న్డేల్లో సక్సెస్ కొన‌సాగాల‌ని ఆశిస్తున్న‌ట్లు ఎమ్మెల్యే హ‌రీశ్ వెల్ల‌డించారు.

https://twitter.com/BCCI/status/1921865509617701165

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు. థ్యాంక్యూ.. కింగ్ కోహ్లీ అని ఆమె త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్ష‌ణం నుంచీ.. అత్యంత స‌క్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ అవ‌త‌రించార‌ని, మేటి బ్యాట‌ర్‌గా రాణించార‌ని, కేవ‌లం క్రికెట్ ఆడ‌డమే కాదు, ఆ గేమ్‌ను ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లార‌ని క‌విత తెలిపారు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్ష‌ణం.. కోహ్లీ కేవ‌లం రికార్డ‌ల‌ను వ‌దిలి వెళ్ల‌డం లేద‌ని, విశ్వాసం... ఆధిప‌త్యం.. క్రీడాస్పూర్తిని వ‌దిలి వెళ్లార‌ని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. 123 టెస్టులు ఆడిన కోహ్లీ.. 9230 ర‌న్స్ చేశాడు. కోహ్లీ టెస్టు కెరీర్‌లో 30 సెంచ‌రీలు, 31 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+