రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి తదితరులతో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన మహేందర్ రెడ్డి దంపతులు.. ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా వీరితోపాటు ఉన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. సీఎం, మంత్రులను కలిసే ముందు పార్టీకి సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్ రెడ్డి సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరిచుకుంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేరతారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో సీఎం, మంత్రులతో బీఆర్ఎస్ నేతల భేటీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
పార్లమెంటు ఎన్నికల్లోపే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇటీవలే పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ నేత వెంకటేశ్ నేత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని, ఆ పార్టీకి కూడా ఎలాంటి రాజకీయ నియమాలు లేవన్నారు.
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications