Harish Rao: అధికారం పోయిన తర్వాత హరీశ్ రావు నోట గద్దరన్న మాట..!

ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గొంత ఎంతో మందిని చైతన్యవంతులను చేసింది. వెన్నుముకలో బుల్లెట్ ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసం పోరాడాడు. తెలంగాణల ఉద్యమంలో పాట పాడి ప్రజలను పోరాటం వైపుగా మళ్లీంచారు. పొడుస్తున్న పొద్దు మీద పాట ప్రతి తెలంగాణ వ్యక్తి గుర్తు ఉంటుంది. సబ్బండ వర్గాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ అప్పటి సీఎం కేసీఆర్ కలవడానికి వెళ్లాడు. కానీ.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎండలో రెండు, మూడు గంటలు ఎదురు చూసిన గద్దర్ తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు గద్దర్ గురించి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. ఆదివారం సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్యం కార్యక్రమంలో పాల్గొన్నారు.

BRS senior leader Harish Rao said that Gaddar was a great singer

గద్దర్ గొప్పతనం, పోరాటాన్ని రేపటి భావితరాలకు తెలియాలని ఆయన కుమారుడు సూర్యం గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సిద్దిపేట కేంద్రంగా గద్దర్ పాటలను ఒక గ్రంధంగా అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతాంగ పోరాటం, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం లాంటి ఐదు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్ పాత్ర ఉందని చెప్పారు. వంద ఉపన్యాసాలు గద్దర్ ఒక్క పాటతో సమానమని ప్రశంసించారు.

పాట ఉన్నంత కాలం గద్దరన్న సజీవంగానే ప్రజల మధ్య ఉంటారని కొనియాడారు. గద్దర్ స్పూర్తి ఆలోచన విధానం కొనసాగించాలని కోరారు. అయితే అప్పుడు మామ గద్దర్ ను అవమానించినప్పుడు హరీశ్ రావు ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారం కోల్పోగానే గద్దర్ గుర్తుకు వచ్చారా అని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+