జైలుపాట పాడిన బండి సంజ‌య్‌ను జైలుకు పంపి బీఆర్ఎస్ సక్సెస్.. ఇప్పుడిదే హాట్ టాపిక్!!

బండి సంజయ్ ని జైలుకు పంపించి బిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యిందా? అదే బిజెపి బిఆర్ఎస్ నాయకుల విషయంలో ఆ పని చేయలేకపోయిందా? కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అనేక కుంభకోణాల్లో ఈ డి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకులను కేంద్రంలోని బిజెపి సర్కార్ ఎందుకు అరెస్టు చేయలేక పోతుంది?

చిన్నచిన్న కారణాలకే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసులు పెట్టి ఇరికిస్తుంది? జైలు పాట పాడిన బండి సంజయ్ ను జైలుకు పంపి బీఆర్ఎస్ పై చెయ్యి సాధించింనట్టేనా? ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

bandi sanjay jail

పదవ తరగతి పేపర్ల లీకేజీ కేసులో వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి హిందీ పదవ తరగతి ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్ కు వాట్సాప్ లో పంపించారని, అంతకుముందు ప్రశ్నాపత్రాల లీకేజ్ కి సంబంధించి వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందని, పక్కా ఆధారాలతో బండి సంజయ్ ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

ఫోన్లో వాట్సప్ చాటింగ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, బండి సంజయ్ ను అరెస్ట్ చేసి హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బండి సంజయ్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు.

మొదట ప్రశ్న పత్రాలు పరీక్షకు ముందు బయటకు రాలేదని, పరీక్ష జరుగుతున్న సమయంలో, వాట్సప్ గ్రూపులలోకి వచ్చాయని కాబట్టి దానిని లీకేజ్ అనలేమని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ గ్రూప్ లలో పంపిన కారణంగా ప్రశాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, దీని వెనుక ప్రధాన సూత్రధారి అని బండి సంజయ్ ను సైతం అరెస్ట్ చేసి చర్యలకు ఉపక్రమించారు. లీకేజ్ కాదని చెప్పిన పోలీసులే, తరువాత లీకేజ్ అంటూ బండి సంజయ్ సూత్రధారి అని టార్గెట్ చేయడాన్ని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక ఇదే సమయంలో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎంతో కాలంగా ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తున్నా, ఇప్పటికి అనేకమార్లు కవిత ఈడి విచారణను ఎదుర్కొన్నప్పటికీ, అరెస్టు విషయంలో అనేకమార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఏకంగా బండి సంజయ్ ఎక్కడ సమావేశం పెట్టినా కవిత అరెస్టు జరుగుతుందని గట్టిగా చెప్పారు. కానీ అది మాత్రం జరగలేదు. కానీ ఊహించని విధంగా బండి సంజయ్ అరెస్ట్ జరిగింది.

బండి సంజయ్ ను ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా అడ్డంగా బుక్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమయంలోనే బిఆర్ఎస్ నాయకులను ఇరకాటంలో పెట్టడంలో బిజెపి సక్సెస్ కాలేదు కానీ, బిఆర్ఎస్ మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా గట్టిగా వాడుకుంటుందని, సక్సెస్ అవుతుందని బండి సంజయ్ అరెస్టుతో అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు సామాన్య ప్రజలలోను చర్చ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీజేపీ చెయ్యలేని పని, పదవతరగతి పరీక్ష పేపర్ల లీకేజీలో బీఆర్ఎస్ చేసిందని చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+