రేవంత్- బాబు- ఓ బ్యాగు: బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో..
Revanth Reddy: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. ఇక మూల ధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఊహించినట్టే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ఇక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ- బడ్జెెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
భట్టి విక్రమార్క నుంచి బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన బ్యాగ్‌ను రేవంత్ రెడ్డి అందుకుంటోన్న వీడియో అది. దీన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డిని ట్రోల్ చేసింది భారత్ రాష్ట్ర సమితి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి.. నోటుకు ఓటు కేసులో చిక్కుకున్న ఉదంతాన్ని గుర్తు చేసింది.
బ్యాగు పట్టుకోగానే ముసిరిన జ్ఞాపకాలు.. అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించింది. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా ఇచ్చినప్పటి వీడియోను కూడా దీనికి యాడ్ చేసింది.
బ్యాగు పట్టుకోగానే
— BRS Party (@BRSparty) July 25, 2024
ముసిరిన జ్ఞాపకాలు! pic.twitter.com/SY0UU4RS2d
ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌గా రవితేజ నటించిన గుర్తుకొస్తోన్నాయి సినిమా టైటిల్ సాంగ్‌ను ప్లే చేసింది. ఈ వీడియో ఇప్పుడ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ నాయకులు దీన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా చేశారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబును ట్రోల్ చేస్తోన్నారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఈ 50 లక్షల రూపాయలతో కూడిన బ్యాగ్‌ను స్టీఫెన్‌సన్‌కు అందజేస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications